Casino Case క్యాసినో వ్యవహారంలో కొనసాగుతున్న ఈడీ విచారణ

ABN , First Publish Date - 2022-07-31T16:33:21+05:30 IST

క్యాసినో (Casino) వ్యవహారంలో ఈడీ (ED) విచారణ కొనసాగుతోంది.

Casino Case క్యాసినో వ్యవహారంలో కొనసాగుతున్న ఈడీ విచారణ

హైదరాబాద్ (Hyderabad): క్యాసినో (Casino) వ్యవహారంలో ఈడీ (ED) విచారణ కొనసాగుతోంది. చికోటి ప్రవీణ్ (Chikoti Praveen), సంపత్ (Sampath) ఆర్థిక లావాదేవీలను అధికారులు పరిశీలించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ రాజకీయ నేతలకు చికోటి ప్రవీణ్ బినామీగా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. క్యాసినో వ్యవహారంలో కోట్ల రూపాయలు హవాలా ద్వారా లావా దేవీలు జరిగినట్లు గుర్తించారు. ఈడీ క్యాసినో క్యాంపు ముగిసిన తర్వాత వారు గెలుచుకున్న ప్రైజ్ మనీ (Prize money)ని హవాలా రూపంలో అందజేసినట్లు  అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ దందాలో పంటర్ల నుంచి కమీషన్ల రూపంలో చికోటి ప్రవీణ్  కోట్ల రూపాయలు వెనకేసుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. నేపాల్, శ్రీలంక, థాయిలాండ్, ఇండోనేషియాలో 7 క్యాసినో క్యాంపులు ఏర్పాటు చేసినట్లు ఆధారాలు కీలకం కానున్నాయి. రేపు (సోమవారం) చికోటి ప్రవీణ్, మాధవరెడ్డి, సంపత్‌లను ఈడీ అధికారులు విచారించినున్నారు.

Updated Date - 2022-07-31T16:33:21+05:30 IST