నెల్లూరు జిల్లాలో కేసులు పెరుగుతున్నా.. తగ్గని రద్దీ

ABN , First Publish Date - 2021-05-10T03:08:04+05:30 IST

వైపు కరోనా కేసులు భారీగా పెరుగుతున్నా ప్రజల్లో మార్పు రావడం లేదు. అనవసరంగా బయటికి రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నా, ఎవరూ పట్టించుకోవడం లేదు.

నెల్లూరు జిల్లాలో కేసులు పెరుగుతున్నా.. తగ్గని  రద్దీ
వెంకటగిరిలో దుకాణాల వద్ద రద్దీ

వెంకటగిరి, డక్కిలి, మే 8 : ఓ వైపు కరోనా కేసులు భారీగా పెరుగుతున్నా  ప్రజల్లో మార్పు రావడం లేదు. అనవసరంగా బయటికి రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నా, ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆదివారం  వెంకటగిరి,  డక్కిలిలో మాంసం, కూరగాయలు, ఇతర దుకాణాల వద్ద మాస్క్‌లు లేకుండా గుంపులుగా చేరారు.. ఇప్పటి వరకు వెంకటగిరిలో 500 లు, డక్కిలిలో 150 వరకు కరోనా కేసులు నమోదయినట్లు అధికారులు చెబుతుండగా, వాస్తవానికి అంతకు పది రెట్ల మంది బాధితులు ఉండవచ్చని అంచనా.   మరణాలు సంఖ్య కూడా ఈ ప్రాంతంలో భారీగానే ఉన్నట్లు తెలిసింది, అయినా ప్రజల్లో  ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. 

రోడ్లపైనే యువత


కర్ఫ్యూ సమయంలో కూడా ఏవేవో కుంటిసాకులు చూపుతూ యువకులు రోడ్లపై తిరుగుతున్నారు. పోలీసులు భారీగా అపరాధ రుసుం విధిస్తున్నా  మార్పురావడం లేదు.

Updated Date - 2021-05-10T03:08:04+05:30 IST