నిషేధిత క్యాట్‌ ఫిష్‌ పట్టివేత

ABN , First Publish Date - 2022-06-26T05:21:33+05:30 IST

నిషేధిత క్యాట్‌ ఫిష్‌లను తరలిస్తున్న వాహనాన్ని శనివారం ఎస్‌ఐ విజయ తమ సిబ్బందితో కలిసి మర్రిగూడెం వద్ద స్వాధీనం చేసుకున్నారు.

నిషేధిత క్యాట్‌ ఫిష్‌ పట్టివేత
క్యాట్‌ ఫిష్‌లను ఖననం చేస్తున్న పోలీసులు

అన్నపురెడ్డిపల్లి, జూన్‌ 25: నిషేధిత క్యాట్‌ ఫిష్‌లను తరలిస్తున్న వాహనాన్ని శనివారం ఎస్‌ఐ విజయ తమ సిబ్బందితో కలిసి మర్రిగూడెం వద్ద స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఐ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు ప్రాంతం నుంచి కొందరు వ్యక్తులు రెండు టన్నుల క్యాట్‌ ఫిష్‌లను కొనుగోలు చేసి ఛత్తీస్‌గఢ్‌కు తరలిస్తున్నారు. శనివారం తెల్లవారు జామున పోలీసులు పెట్రోలింగ్‌ నిర్వహిస్తుండగా అతి వేగంగా వెళ్తున్న వాహనాన్ని అనుమానించి వెంబడించి తనిఖీ చేశారు. అందులో నిషేధిత క్యాట్‌ ఫిష్‌ ఉండటంతో వాహనాన్ని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తిపై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు. 

Updated Date - 2022-06-26T05:21:33+05:30 IST