పిల్లికి రిటైర్‌మెంట్.. సోషల్ మీడియాలో వైరల్!

ABN , First Publish Date - 2020-08-08T00:46:01+05:30 IST

ఓ పిల్లి తన ఉద్యోగం నుంచి రిటైరవుతోంది. ఈ విషయాన్ని దాని సహోద్యోగులు ట్విట్టర్‌లో పంచుకోవడంతో ఈ వార్త తెగవైరలవుతోంది.

పిల్లికి రిటైర్‌మెంట్.. సోషల్ మీడియాలో వైరల్!

లండన్: ఓ పిల్లి తన ఉద్యోగం నుంచి రిటైరవుతోంది. ఈ విషయాన్ని దాని సహోద్యోగులు ట్విట్టర్‌లో పంచుకోవడంతో ఈ వార్త తెగవైరలవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బ్రిటన్‌ రాజధాని లండన్‌లోని ఫారెన్ అండ్ కామన్‌వెల్త్ ఆఫీసు(ఎఫ్‌సీఓ)లో ఉండే ‘లార్డ్ పామర్‌స్టన్’ అనే పిల్లికి రిటైర్‌మెంట్ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. సోషల్ మీడియాలో బాగా పాపులరైన ఈ పామర్‌స్టన్.. నాలుగేళ్ల క్రితం ఎఫ్‌సీఓలో ఉద్యోగానికి వచ్చింది. ఈ విషయాన్ని ఎఫ్‌సీఓ ఉన్నతాధికారి సర్ సైమన్ మక్‌డొనాల్డ్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ‘నాలుగేళ్ల క్రితం పామర్‌స్టన్ ఈ ఆఫీసుకు వచ్చింది. ఏదో ఎలుకలు పట్టడానికి తనను తెచ్చామని అనుకున్నానే గానీ, ఓ సోషల్ మీడియా స్టార్‌ను ఆఫీసుకు తీసుకొచ్చారని ఊహించలేకపోయా. ప్రస్తుతం లాక్‌డౌన్‌ను చక్కగా ఎంజాయ్ చేస్తున్న పామర్‌స్టన్‌కు రిటైర‌మెంట్ ఇవ్వాలని అందరం నిర్ణయించాం’ అని సైమన్ ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో పామర్‌స్టన్ ఖాతాకు లక్షపైగా ఫాలోవర్లు ఉండటం విశేషం.

Updated Date - 2020-08-08T00:46:01+05:30 IST