కాటన్‌ కృషితో అన్నపూర్ణగా గోదావరి జిల్లాలు

ABN , First Publish Date - 2022-05-16T06:45:24+05:30 IST

గోదావరి జిల్లాలను అన్న పూర్ణగా మార్చిన అపర భగీరథుడు కాటన్‌ మహాశయుడని ఎమ్మెల్యేలు కొండేటి చిట్టిబాబు, రాపాక వరప్రసాదరావులు కొనియాడారు.

కాటన్‌ కృషితో అన్నపూర్ణగా గోదావరి జిల్లాలు

మామిడికుదురు, మే 15: గోదావరి జిల్లాలను అన్న పూర్ణగా మార్చిన అపర భగీరథుడు కాటన్‌ మహాశయుడని ఎమ్మెల్యేలు కొండేటి చిట్టిబాబు, రాపాక వరప్రసాదరావులు కొనియాడారు. తహశీల్దార్‌ కార్యాలయం వద్ద విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జడ్పీ టీసీ కసిరెడ్డి అంజిబాబు, నగరం పీఏసీఎస్‌ అధ్యక్షుడు కటకంశెట్టి ఆదిత్యకుమార్‌, ఎంపీటీసీ వర్ధినేని రాము, వాసంశెట్టి చినబాబు, మట్టపర్తి శివ పాల్గొన్నారు. 

అమలాపురం టౌన్‌: సర్‌ ఆర్థర్‌ కాటన్‌ జయంతి వేడుక లను కోనసీమ జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించా రు. అమలాపురం ఆర్డీవో కార్యాలయం వద్ద కాటన్‌ విగ్ర హానికి జేఏసీ చైర్మన్‌ వాసా ఎస్‌.దివాకర్‌, కన్వీనర్లు బం డారు రామ్మోహనరావు, కరాటం ప్రవీణ్‌, హ్యూమన్‌ రైట్స్‌ ఆఫ్‌ ఇండియా రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ రాయుడు శ్రీరామచం ద్రమూర్తి, విశ్రాంత ఎంఈవో జంగా రాజేంద్రకుమార్‌ పూల మాలలువేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్‌ మార్గ్‌లోని కాటన్‌ విగ్రహానికి ప్రవీణ్‌ ఆధ్వర్యంలో పుష్పాభిషేకం నిర్వహిం చారు. కార్యక్రమంలో కరాటం జగదీష్‌, గుర్రం సూర్య మహే ష్‌, కరాటం సూరిబాబు, కె.నరసింహారావు, వై.వరప్రసాద్‌, చోడె జాన్‌పాల్‌  పాల్గొన్నారు. కాటన్‌ జయంతి వేడుకలను ఆదివారం నడిపూడిలాకుల వద్ద నిర్వహించారు. గ్రామ సర్పంచ్‌ చెల్లుబోయిన నాని, ఏఎంసీ మాజీ చైర్మన్‌ బొక్కా ఆదినారాయణల ఆధ్వర్యంలో కాటన్‌ విగ్రహానికి పూలమాల లువేసి నివాళులర్పించారు. రైతు సంఘ నాయకులు అప్పారి వెంకటరమణ, కుంపట్ల శ్రీను, రాయుడు బాల, కాండ్రేగుల సతీష్‌, సాయిశేఖర్‌, చిక్కం శ్రీను   పాల్గొన్నారు.



Updated Date - 2022-05-16T06:45:24+05:30 IST