తాగునీటి కోసం తిప్పలు..

ABN , First Publish Date - 2022-06-23T05:28:50+05:30 IST

అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్న చందానా సమృద్ధిగా జల వనరులు ఉన్నప్పటికి నీటి సరఫరాపై పర్యవేక్షణ కోరవడటంతో ప్రజలు తాగునీటి అవస్థలు పడుతున్నారు.

తాగునీటి కోసం తిప్పలు..
తాగునీటి కోసం పంపుల వద్ద వేచి ఉన్న ప్రజలు

 పైపులైన్‌ లీకేజీతో నిలిచిన భగీరఽథ నీటి సరఫరా

 జీతాలు అందక సిబ్బంది అవస్థలు

 మరమ్మతుల చేసేందుకు నిరాకరణ..

బోనకల్‌, జూన్‌ 22: అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్న చందానా సమృద్ధిగా జల వనరులు ఉన్నప్పటికి నీటి సరఫరాపై పర్యవేక్షణ కోరవడటంతో ప్రజలు తాగునీటి అవస్థలు పడుతున్నారు. ప్రతి ఇంటికి తాగునీటిని సరఫరా చేసే లక్ష్యంతో ప్రభుత్వం మిషన్‌ భగీరథ పథకాన్ని మూడు ఏళ్ల క్రితం ప్రవేశ పెట్టింది. తాగునీటి సరఫరా చేసే బాధ్యతలను ఎల్‌ఎంటీ కంపెనీకి అప్పగించారు. ఇందులో బాగంగా సదరు కంపెనీ వారు జిల్లా వ్యాప్తంగా 550 మంది సిబ్బందిని తీసుకున్నారు. నీటి విడుదల, లీకేజీలకు మరమ్మతులు చేసే బాద్యతలను అప్పగించారు. కాని సిబ్బందికి మూడు నెలలుగా వేతనాలు అందక పోవడంతో వారు పైపులైన్ల లీకేజీ మరమ్మతు పనులు చేసేందుకు ముందుకు రావడం లేదు. బోనకల్‌ మండలం రాపల్లి గ్రామం వద్ద గల ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌ను నింపి అక్కడ నుంచి రాపల్లి, కలకోట, రాయనపేట, మోటమర్రి, ఆళ్లపాడు, గోవిందాపురం(ఎ), బ్రాహ్మాణపల్లికి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. రాపల్లి, కలకోట గ్రామాల వద్ద పైపులైన్లకు లీకేజీలు ఏర్పడిన కారణంగా ఈ నెల 21 నుంచి నీటి సరఫరా నిలిచి పోయింది. లీకేజీల మరమ్మత్తు పనులు చేసేందుకు వేతనాలు అందని కారణంగా ముందుకు రాకపోవడంతో ప్రజలు తాగునీటి సమస్యతో సతమతమవుతున్నారు. నెలవారి ఇచ్చే 12 వేల జీతం కూడ తమకు సకాలం ఇవ్వకపోతే తాము కుటుంబాలను ఎలా నెట్టుకు రావాలని వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలల్లో మిషన్‌ భగీరథ నీరు రాక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ప్రతి నెల వర్కర్లకు వేతనాలు ఇచ్చి సకాలంలో పైపులైన్ల లీకేజీలకు మరమ్మతులు చేసి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. 


తాగునీటి సమస్యతో ఇబ్బందులు

 మర్రి తిరుపతిరావు, సర్పంచ్‌, ఆళ్లపాడు


పైపులైన్ల మరమ్మతులు చేయకపోవడంతో ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. భగీరథ వర్కర్లకు జీతాలు ఇవ్వక పోవడంతో  వారు పనులు చేయడం లేదని తమకు చెప్పారు. ఆరు నెలలకు ఒకసారి ఇలాంటి సమస్యలతో తాగునీటి సరఫరా నిలిచి పోతుంది. అధికారులు సమస్యను పరిష్కరించాలి.


భగీరథ నీళ్లు లేక..

యంగల దయామణీ,సర్పంచ్‌  కలకోట


 గ్రామంలో మిషన్‌ భగీరథ నీళ్లు రాకపోవడంతో ప్రజలకు సమాధానం పరిస్థితి లేదు. బోర్లు వాడుకలో లేనందున తాగటానికి పనికి రావడం లేదు. రోజువారి మిషన్‌ భగీరద నీటిని తాగుతున్నారు. రెండు రోజులు గా నీళ్లు రాక ప్రజల అవస్థలు పడుతున్నారు. లీకేజీలకు వెంటనే మరమ్మతులు చేసి తాగునీటిని అందించాలి.


Updated Date - 2022-06-23T05:28:50+05:30 IST