cauliflower కర్రీ

ABN , First Publish Date - 2021-07-22T18:09:02+05:30 IST

క్యాలిఫ్లవర్‌ ముక్కలు- మూడు కప్పులు, ఉల్లిగడ్డ, టమోటా ముక్కలు- చెరో కప్పు, జీలకర్ర- స్పూను, గరం మసాలా- స్పూను, కారం, పసుపు- చెరో స్పూను, అల్లం వెల్లుల్లి పేస్టు- ముద్ద, ఉప్పు, నూనె- తగినంత.

cauliflower కర్రీ

కావలసిన పదార్థాలు: క్యాలిఫ్లవర్‌ ముక్కలు- మూడు కప్పులు, ఉల్లిగడ్డ, టమోటా ముక్కలు- చెరో కప్పు, జీలకర్ర- స్పూను, గరం మసాలా- స్పూను, కారం, పసుపు- చెరో స్పూను, అల్లం వెల్లుల్లి పేస్టు- ముద్ద, ఉప్పు, నూనె- తగినంత.


తయారుచేసే విధానం: ముందుగా క్యాలిఫ్లవర్‌ ముక్కల్ని ఉప్పునీళ్లలో ఉడికించి పెట్టుకోవాలి. ఓ పాన్‌లో నూనె వేసి కాగాక జీలకర్ర, కరివే పాకు, పసుపు ఓ నిమిషం వేయించాలి. ఆ తరవాత ఉల్లిముక్కల్ని వేయాలి. కాసేపయ్యాక టమోటా ముక్కలు చేర్చి మెత్తగా అయ్యాక అన్ని పొడులనూ, అల్లం వెల్లుల్లి ముద్ద, ఉప్పునూ వేసి బాగా కలపాలి. దీంట్లోనే క్యాలిఫ్లవర్‌ ముక్కల్ని కూడా వేసి, కలిపి మూత పెట్టి అయిదు నిమిషాలు ఉడికిస్తే క్యాలిఫ్లవర్‌ కర్రీ రెడీ.

Updated Date - 2021-07-22T18:09:02+05:30 IST