ltrScrptTheme3

వేశ్యగా శ్వేతా బసు... 12 కట్స్ సూచించిన CENSOR BOARD

Oct 23 2021 @ 19:40PM

‘సెంట్రల్ బోర్డ్ ఆప్ ఫిల్మ్ సర్టిఫికేషన్(సిబిఎఫ్‌సి)’ వారు తన తాజా చిత్రానికి మొత్తం 12 కట్స్ సూచించారని దర్శకుడు మధుర్ భండార్కర్ చెప్పారు. ‘ఇండియా లాక్‌డౌన్’ పేరుతో ఆయన సరికొత్త సినిమాని రూపొందించారు. ‘ఏ‘ సర్టిఫికెట్ ఇచ్చినప్పటికీ సిబిఎఫ్‌సి తన మూవీకి పలు కత్తిరింపులు విధించిందని ఆయన అన్నారు. 10 చోట్ల ఆడియో తొలగించాలని, రెండు చోట్ల సీన్స్ కట్ చేయాలని అధికారులు సూచించారట. 


మొత్తం నాలుగు పాత్రల చుట్టూ తిరిగే కథతో ‘ఇండియా లాక్‌డౌన్’ సినిమాని దర్శకుడు మధుర్ భండార్కర్ రూపొందించారు. అయితే, ఇందులో... తెలుగులో పలు చిత్రాలు చేసిన హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్ కూడా కనిపించనుంది. ఆమె తన స్టోరీ సెగ్మెంట్‌లో ఓ వేశ్య పాత్రలో నటించింది. అందులో మాత్రమే సెన్సార్ బోర్డ్ తన కట్స్ అన్నిట్ని సూచించినట్లు సమాచారం. లాక్‌డౌన్ సమయంలో వేశ్యల దుస్థితిని శ్వేతా బసు ప్రసాద్ సెగ్మెంట్లో డైరెక్టర్ చూపించారు. దాంతో కొన్ని బోల్డ్ డైలాగ్స్, సీన్స్ తప్పలేదట. వాటిలో కొన్నిటికి ‘ఏ’ సర్టిఫికెట్ ఇస్తూ కూడా సిబిఎఫ్‌సి అంగీకరించలేదు. మరి సెన్సార్ నిర్ణయానికి వ్యతిరేకంగా దర్శకనిర్మాతలు కోర్టుకు వెళతారేమో చూడాలి... 

Follow Us on:

Bollywoodమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.