Viveka murder case: ఎర్రగంగిరెడ్డి బెయిల్ రద్దు చేయండి.. సుప్రీంను ఆశ్రయించిన సీబీఐ

ABN , First Publish Date - 2022-07-25T16:51:22+05:30 IST

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డిహత్య కేసులో ఏ1గా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ

Viveka murder case: ఎర్రగంగిరెడ్డి బెయిల్ రద్దు చేయండి.. సుప్రీంను ఆశ్రయించిన సీబీఐ

న్యూఢిల్లీ/అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి(YS vivekananda reddy) హత్య కేసులో ఏ1గా ఉన్న ఎర్ర గంగిరెడ్డి(Erra gangireddy) బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టు(Supreme court)లో సీబీఐ(CBI) పిటిషన్ దాఖలు చేశారు. నిందితుడు గంగిరెడ్డికి సెషన్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే గంగిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలంటూ మొదట హైకోర్టు(High court)ను సీబీఐ ఆశ్రయించింది. కాగా... సీబీఐ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వైఎస్ వివేకా హత్య కేసులో దాఖలైన ఛార్జిషీటులోనూ గంగిరెడ్డిని సీబీఐ ఏ1గా చేర్చింది. సీబీఐ పిటిషన్‌పై త్వరలో సుప్రీంలో విచారణ జరుగనుంది. 

Updated Date - 2022-07-25T16:51:22+05:30 IST