Mamata Banerjee : మమత బెనర్జీకి సీబీఐ షాక్

ABN , First Publish Date - 2022-08-11T16:51:26+05:30 IST

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ (Mamata Banerjee

Mamata Banerjee : మమత బెనర్జీకి సీబీఐ షాక్

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ (Mamata Banerjee) నేతృత్వంలోని టీఎంసీ నేతల అరెస్టుల పరంపర కొనసాగుతోంది. విద్యా సంస్థల్లో నియామకాల కుంభకోణం కేసులో పార్థ ఛటర్జీ ఇటీవల అరెస్టయ్యారు. తాజాగా గురువారం కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) ఆమెకు  షాక్ ఇచ్చింది. ఆమెకు అత్యంత సన్నిహిత సహచరుడు, టీఎంసీ బీర్భూమ్ జిల్లా అధ్యక్షుడు అనుబ్రత మోండల్‌ను అరెస్ట్ చేసింది. ఆవులను అక్రమంగా రవాణా చేసినట్లు 2020లో నమోదైన కేసులో ఆయనపై ఈ చర్య తీసుకుంది. 


సీబీఐ జారీ చేసిన 10 సమన్లను అనుబ్రత మోండల్ (Anubrata Mondal) పట్టించుకోలేదు. దీంతో సీబీఐ కోర్టును ఆశ్రయించింది. అంతకుముందు ఆయనను రెండుసార్లు సీబీఐ ప్రశ్నించింది. 


సీబీఐ వెల్లడించిన వివరాల ప్రకారం, 2015 నుంచి 2017 మధ్య కాలంలో విదేశాలకు తరలిస్తుండగా 20 వేలకుపైగా ఆవుల తలలను సరిహద్దు భద్రతా దళం (BSF) స్వాధీనం చేసుకుంది. దీనిపై సీబీఐ 2020లో కేసు నమోదు చేసింది. ఈ కేసుపై దర్యాప్తులో భాగంగా బీర్భూమ్‌లో ఇటీవల సీబీఐ దాడులు నిర్వహించింది. ఈ కేసులో మోండల్‌తోపాటు ఆయన బాడీగార్డ్ సైగల్ హుస్సేన్‌ను కూడా అరెస్టు చేశారు. 


టీఎంసీ కీలక నేత, మమత బెనర్జీకి అత్యంత సన్నిహితుడు పార్థ ఛటర్జీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయనతోపాటు ఆయనకు సన్నిహితురాలు అర్పిత ముఖర్జీకి చెందిన ఫ్లాట్ల నుంచి పెద్ద మొత్తంలో నగదు, ఇతర విలువైన ఆభరణాలను ఈడీ స్వాధీనం చేసుకుంది. 


Updated Date - 2022-08-11T16:51:26+05:30 IST