Submarine సమాచారం లీక్.. నేవీ అధికారుల అరెస్ట్

ABN , First Publish Date - 2021-10-26T23:53:40+05:30 IST

ఈ విషయమై ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై దర్యాప్తుకు ఇండియన్ నేవీ కూడా ఆదేశించింది. ఈ ఘటన మాత్రమే కాకుండా మరిన్ని తప్పిదాలు ఏమైనా జరిగి ఉంటాయా అనే విషయమై కూడా దర్యాప్తు చేయాలని సీబీఐనీ కోరింది..

Submarine సమాచారం లీక్.. నేవీ అధికారుల అరెస్ట్

న్యూఢిల్లీ: సబ్‌మెరైన్ సమాచారాన్ని తప్పుదోవ పట్టించిన ముగ్గురు నేవీ అధికారుల్ని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తాజాగా అరెస్ట్ చేసింది. అరెస్టైన నేవీ అధికారుల్లో ఒకరు కమాండర్ ర్యాక్ అధికారి అని సమాచారం. సబ్‌మెరైన్ అభివృద్ధికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పదవీ విరమణ చేసిన ఇద్దరు అధికారులకు వీరు ముగ్గురూ లీక్ చేశారని సీబీఐ పేర్కొంది. పదవీ విరమణ చేసిన అధికారులపై కొంత కాలంగా నిఘా ఉంచిన ఇంటలీజెన్స్ వర్గాలు అందించిన సమాచారం ఆధారంగా తదుపరి దర్యాప్తు ఉంటుందని సీబీఐ అధికారులు పేర్కొన్నారు. ఈ విషయమై ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై దర్యాప్తుకు ఇండియన్ నేవీ కూడా ఆదేశించింది. ఈ ఘటన మాత్రమే కాకుండా మరిన్ని తప్పిదాలు ఏమైనా జరిగి ఉంటాయా అనే విషయమై కూడా దర్యాప్తు చేయాలని సీబీఐకి సూచించింది.

Updated Date - 2021-10-26T23:53:40+05:30 IST