Coal smuggling కేసులో ఎంపీ అభిషేక్ బెనర్జీ భార్యను ప్రశ్నిస్తున్న సీబీఐ

ABN , First Publish Date - 2022-06-14T18:06:08+05:30 IST

బొగ్గు స్మగ్లింగ్ కేసులో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ భార్య రుజీరాను విచారించేందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)మంగళవారం...

Coal smuggling కేసులో ఎంపీ అభిషేక్ బెనర్జీ భార్యను ప్రశ్నిస్తున్న సీబీఐ

కోల్‌కతా(పశ్చిమబెంగాల్): బొగ్గు స్మగ్లింగ్ కేసులో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ భార్య రుజీరాను విచారించేందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)మంగళవారం కోల్‌కతా ఇంటికి చేరుకుంది. బొగ్గు అక్రమ రవాణా కేసుకు సంబంధించి ఎనిమిది మంది సభ్యుల సీబీఐ బృందం టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ భార్య రుజీరాను ప్రశ్నించే అవకాశం ఉంది.ఎంపీ అభిషేక్ మంగళవారం మధ్యాహ్నం రోడ్ షోకి నాయకత్వం వహించేందుకు త్రిపురకు బయలుదేరారు.పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ కోల్‌కతా నుంచి ఢిల్లీకి మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రతిపక్ష పార్టీల సమావేశానికి బయలుదేరనున్నారు.దుర్గాపూర్-అసన్సోల్ బెల్ట్ నుంచి, జార్ఖండ్ నుంచి అక్రమంగా బొగ్గును వెలికితీసినందుకు అనుప్ మజీ, ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్ లిమిటెడ్, ఇతరులపై సీబీఐ కేసు నమోదు చేసింది.


ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకుల సహకారంతో ఈ సరిహద్దు ప్రాంతాల్లో కోట్లాది రూపాయల విలువైన అక్రమ బొగ్గు అక్రమ రవాణా జరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.అభిషేక్ బెనర్జీ, అతని కుటుంబ సభ్యులతో లింకులు ఉన్న లీప్స్ అండ్ బౌండ్ ప్రైవేట్ లిమిటెడ్, లీప్స్ అండ్ బౌండ్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ ఎల్‌ఎల్‌పి అనే రెండు కంపెనీలు రూ. 4.37 కోట్ల నిధులను అందుకున్నాయని ఈ కేసును కూడా విచారిస్తున్న ఈడీ విచారణలో తేలింది. అభిషేక్ బెనర్జీ తండ్రి అమిత్ బెనర్జీ లీప్స్ అండ్ బౌండ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లలో ఒకరు. అతని భార్య రుజీరా బెనర్జీ అతని తండ్రితో పాటు లీప్ అండ్ బౌండ్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ లిమిటెడ్‌కి డైరెక్టర్‌గా ఉన్నారు.




Updated Date - 2022-06-14T18:06:08+05:30 IST