ఢిల్లీ లిక్కర్ పాలసీలో TRS పెద్ద నేతలు..? తెలంగాణలోనూ CBI సోదాల టెన్షన్‌..

ABN , First Publish Date - 2022-08-19T19:53:59+05:30 IST

టీఆర్ఎస్ నేతల్లో(TRS Leaders) సీబీఐ(CBI) సోదాల టెన్షన్‌ చోటు చేసుకుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ(Delhi Liquor Polocy)లో అవకవతకల

ఢిల్లీ లిక్కర్ పాలసీలో TRS పెద్ద నేతలు..? తెలంగాణలోనూ CBI సోదాల టెన్షన్‌..

Hyderabad : టీఆర్ఎస్ నేతల్లో(TRS Leaders) సీబీఐ(CBI) సోదాల టెన్షన్‌ చోటు చేసుకుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ(Delhi Liquor Polocy)లో అవకవతకల వ్యవహారంలో టీఆర్ఎస్ పెద్ద నేతలున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే  7 రాష్ట్రాలలో 21 చోట్ల సీబీఐ దాడులు(CBI Rides) నిర్వహించింది. హైదరాబాద్‌(Hyderabad)లో కూడా సోదాలకు రెడీ ఆయినట్టు సమాచారం. ఇటీవల ఢిల్లీ పర్యటనలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌(Delhi CM Aravind Kejriwal)తో తెలంగాణ సీఎం కేసీఆర్(Telangana CM KCR) భేటి అయ్యారు. ఆ సమయంలో కేసీఆర్ వెంట పలువురు టీఆర్ఎస్ ముఖ్యలు సైతం ఉన్నారు. దేశవ్యాప్తంగా సీబీఐ సోదాలు జరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని టీఆర్ఎస్ నేతలంతా అలెర్ట్ అయ్యారు.


కాగా.. తాజాగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా(Manish Sisodiya) నివాసంలో ఈ ఉదయం సీబీఐ సోదాలు నిర్వహించింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ(Delhi Excise Polocy)లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విచారణకు సంబంధించి మనీష్ సిసోడియా నివాసంతో పాటు ఏడు రాష్ట్రాల్లోని 21 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. కేంద్ర హోం శాఖ ఇచ్చిన సమాచారం మేరకు ఈ సోదాలు జరిగినట్టు తెలుస్తోంది. సీబీఐ విచారణను తాము స్వాగతిస్తామని.. తాము ఎటువంటి అవకతవకలకు పాల్పడలేదని.. అందుకే ఈ విచారణలో ఎటవంటి అవకతవకలు బయటకు రావని మనీష్ సిసోడియా ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. 


ఈ క్రమంలోనే తమను కూడా సీబీఐ సోదాల పేరుతో వేధించవచ్చని టీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారు. ఇప్పటికే తెలంగాణ సీఎం కేంద్రంతో ఢీ అంటే ఢీ అంటున్నారు. మరోవైపు అవకాశం దొరికినప్పుడల్లా కేంద్ర పెద్దలను దుయ్యబడుతున్నారు. మరోవైపు తెలంగాణ అంతో ఇంతో బీజేపీకి ఫేవర్‌గా ఉంది. ఈ క్రమంలో ఎలాగైనా తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ చూస్తోంది. దీంతో టీఆర్ఎస్ నేతలపై సీబీఐ బాణాన్ని కేంద్ర పెద్దలు వదిలే అవకాశం ఉందని సమాచారం. పైగా ఢిల్లీ లిక్కర్ పాలసీ అవకవతకల వ్యవహారంలో టీఆర్ఎస్ పెద్ద నేతలున్నట్టు ఆరోపణలు కాస్త గట్టిగానే వినిపిస్తున్నాయి. దీంతో టీఆర్ఎస్ నేతలు మరింత భయపడుతున్నారు.

Updated Date - 2022-08-19T19:53:59+05:30 IST