CBI summons: టీఎంసీ ఎమ్మెల్యేకు సీబీఐ సమన్లు

ABN , First Publish Date - 2022-09-06T17:42:38+05:30 IST

టీఎంసీకి(TMC MLA) చెందిన మరో ఎమ్మెల్యే పరేష్ పాల్‌కు సీబీఐ తాజాగా సమన్లు జారీ ...

CBI summons: టీఎంసీ ఎమ్మెల్యేకు సీబీఐ సమన్లు

కోల్‌కతా: టీఎంసీకి(TMC MLA) చెందిన మరో ఎమ్మెల్యే పరేష్ పాల్‌కు సీబీఐ తాజాగా సమన్లు జారీ (CBI summons)చేసింది. పశ్చిమ బెంగాల్‌లో (West Bengal)ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలకు (post poll violence)సంబంధించి టీఎంసీ ఎమ్మెల్యే పరేష్ పాల్‌కు సీబీఐ సమన్లు ​​జారీ చేసింది.ఈ వారంలోగా కోల్‌కతాలోని నిజాం ప్యాలెస్ సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని టీఎంసీ ఎమ్మెల్యేను ఆదేశించింది.ఉత్తర కోల్‌కతాకు చెందిన అభిజిత్ సర్కార్ అనే బీజేపీ కార్యకర్త పోలింగ్ ఫలితాలు వెలువడిన రోజే హత్యకు గురయ్యాడు.బీజేపీ(bjp) కార్యకర్తను టీఎంసీ వారే హత్య చేశారని మృతుడి కుటుంబసభ్యులు సీబీఐకు(CBI) ఫిర్యాదు చేశారు. 


ఈ కేసులో తొలుత కోల్‌కతా పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు. అనంతరం కోల్ కత్తా హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు చేపట్టింది.ఘర్షణల్లో పలువురు పార్టీ కార్యకర్తలు మరణించడం, పలువురు గాయపడటంతో పశ్చిమ బెంగాల్‌లో హింస చెలరేగింది. బెంగాల్ రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో బెంగాల్ అప్పటి గవర్నర్ జగదీప్ ధన్‌ఖర్(Bengal ex Governor Jagdeep Dhankhar) రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి, డీజీపీ, కోల్‌కతా కమీషనర్‌లను పిలిపించి శాంతిభద్రతలను పునరుద్ధరించాలని ఆదేశించారు. ప్రతిపక్ష బీజేపీ కార్యకర్తలపై జరిగిన హింసపై నివేదిక ఇవ్వాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని అప్పటి గవర్నర్ కోరారు.


Updated Date - 2022-09-06T17:42:38+05:30 IST