సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల

ABN , First Publish Date - 2021-07-30T21:07:53+05:30 IST

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 12వ తరగతి పరీక్షల ఫలితాలను ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు విడుదల చేసింది

సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల

న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 12వ తరగతి పరీక్షల ఫలితాలను ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు విడుదల చేసింది. విద్యార్థులు తమ ఫలితాలను cbseresults.nic.in. అధికారిక వెబ్‌సైట్ ద్వారా చూసుకోవచ్చు. సీబీఎస్ఈ రోల్ నెంబర్‌ను ఎంటర్ చేసి ఫలితాలను పొందవచ్చు. కరోనా కారణంగా మేలో జరగాల్సిన పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. అలాగే పదో తరగతి పరీక్షలను కూడా రద్దు చేసింది. ఆ ఫలితాలను కూడా త్వరలో ప్రకటించనుంది.


కాగా 12వ తరగతి ఫలితాల్లో 99.37శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఉత్తీర్ణత నమోదైనట్టు సీబీఎస్ఈ వెల్లడించింది. గతేడాదితో పోలీస్తే ఈసారి 10.59శాతం ఉత్తీర్ణత పెరిగినట్టు తెలిపారు.

Updated Date - 2021-07-30T21:07:53+05:30 IST