సీఈ బ్యారేజీ పనుల పరిశీలన

ABN , First Publish Date - 2022-05-25T02:48:27+05:30 IST

సంగం బ్యారేజీ పనులను తెలుగుగంగ చీఫ్‌ ఇంజనీరు హరినారాయణరెడ్డి మంగళవారం పరిశీలించారు. బ్యారేజీ వద్ద వంతెనపై జరుగు

సీఈ బ్యారేజీ పనుల పరిశీలన
సంగం బ్యారేజీ వద్ద ఎలక్ట్రికల్‌ పనులను పరిశీలిస్తున్న సీఈ హరినారాయణరెడ్డి, తదితరులు

సంగం, మే 24: సంగం బ్యారేజీ పనులను తెలుగుగంగ చీఫ్‌ ఇంజనీరు హరినారాయణరెడ్డి మంగళవారం పరిశీలించారు. బ్యారేజీ వద్ద వంతెనపై జరుగుతున్న ఎలక్ట్రికల్‌, గేట్ల మోటారు నిర్వహణ సిస్టమ్‌ పనులను ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. వాటిపై పలు సూచనలు అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేసేందుకు ఏజెన్సీ కృషి చేస్తుందని తెలిపారు. పెండింగ్‌ పనులన్నీ ప్రాధాన్యత క్రమంలో వేగంగా జరుగుతున్నాయన్నారు. ఏజెన్సీకి ఇప్పటి వరకు ఇవ్వాల్సిన బిల్లులన్నీ ఇచ్చామన్నారు. బ్యారేజీకి ఇరువైపులా సుందరీకరణ పనులు కూడా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. బ్యారేజీ వద్ద ఏర్పాటు చేయనున్న దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహం తయారీ  పూర్తి అయిందని, మేకపాటి గౌతమ్‌రెడ్డి విగ్రహం తయారీ పనులు ప్రారంభించామన్నారు. నెలరోజులకు పూర్తవుతుందన్నారు. జూలై 20వ తేదీ వరకు ప్రభుత్వం గడువిచ్చిందని, ఆ తరువాత సమయం చూసి బ్యారేజీని ప్రారంభించేందుకు ప్రభుత్వం తేదీని ఖరారు చేస్తుందని సీఈ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏజెన్సీ అధినేత రాజు, సైట్‌ ఇంజనీరు ఆనందరావు, విజయభాస్కర్‌ తదితరులు  పాల్గొన్నారు.

Updated Date - 2022-05-25T02:48:27+05:30 IST