సీఈ కార్యాలయం ముట్టడి ఉద్రిక్తం

ABN , First Publish Date - 2022-05-28T04:31:03+05:30 IST

చెరువుల నుంచి నల్లమట్టి తరలింపును నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇరిగేషన్‌ సీఈ కార్యాల యం ముట్టడి శుక్రవారం జిల్లా కేంద్రంలో ఉద్రిక్తంగా మారింది.

సీఈ కార్యాలయం ముట్టడి ఉద్రిక్తం
నల్లమట్టి తరలింపును నిరసిస్తూ బీజేపీ నియోజకవర్గం ఇన్‌చార్జి దిలీప్‌ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిస్తున్న బీజేపీ కార్యకర్తలు

- నల్లమట్టి తరలింపును వ్యతిరేకిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా

- ఇరిగేషన్‌ అధికారులతో వాగ్వాదం

- ఆందోళనకారులను అరెస్టు చేసిన పోలీసులు


నాగర్‌కర్నూల్‌, మే 27 (ఆంధ్రజ్యోతి) : చెరువుల నుంచి నల్లమట్టి తరలింపును నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇరిగేషన్‌ సీఈ కార్యాల యం ముట్టడి శుక్రవారం జిల్లా కేంద్రంలో ఉద్రిక్తంగా మారింది. చెరువులు, కుంటల నుంచి నల్లమట్టి తరలింపు విషయంలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని, నిబంధనలను గాలికొదిలేసి అధికార యంత్రాంగం ఇష్టారీతిన ప్రవర్తిస్తుందంటూ సీఈ కార్యాలయం ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చింది. ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి దిలీప్‌ నాయకత్వంలో ఆ పార్టీ కార్యకర్తలు ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు సీఈ కార్యాలయం ఎదుట బైఠాయించారు. నల్లమట్టి తరలింపునకు వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. సీఈ ఈ అంశంపై వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆయన అందుబాటులో లేకపోవడం ఈఈ పార్థసారథి వివరణ ఇవ్వబోగా నల్లమట్టి తరలింపునకు సంబంధించి పత్రాలు తమకు ఇవ్వాలంటూ ఆందోళన కారులు డిమాండ్‌ చేశారు. దీంతో వాగ్వాదం చోటు చేసుకుంది. తమకు సరైన సమా చారం ఇచ్చి తీరాల్సిందేనంటూ బీజేపీ నాయకులు పట్టుబట్టారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి దిలీప్‌ అధికారుల వ్యవహార శైలిని దుయ్యబట్టారు. బీజేపీ పార్లమెంట్‌ కన్వీనర్‌ బుసిరెడ్డి సుధాకర్‌రెడ్డి, దొడ్ల రాజావర్ధన్‌రెడ్డి, ఎలిమే రాము, రాధారెడ్డి, ఉమాదేవి, అపర్ణారెడ్డి, మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు జాకీర్‌హుస్సేన్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-28T04:31:03+05:30 IST