CET Results on 30th: 30న సీఈటీ ఫలితాలు

ABN , First Publish Date - 2022-07-26T17:55:45+05:30 IST

వృత్తివిద్యా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (సీఈటీ) ఫలితాలు(Results) ఈనెల 30న విడుదల చేస్తామని ఉన్నత విద్యాశాఖ

CET Results on 30th: 30న సీఈటీ ఫలితాలు

                       - ఉన్నత విద్యాశాఖ మంత్రి అశ్వత్థనారాయణ వెల్లడి 


బెంగళూరు, జూలై 25 (ఆంధ్రజ్యోతి): వృత్తివిద్యా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (సీఈటీ) ఫలితాలు(Results) ఈనెల 30న విడుదల చేస్తామని ఉన్నత విద్యాశాఖ మంత్రి డాక్టర్‌ అశ్వత్థనారాయణ(Ashwatthanarayana) వెల్లడించారు. సోమవారం బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ జూన్‌లో జరిగిన సీఈటీ మౌల్యమాపన ప్రక్రియ పూర్తయిందన్నారు. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ చదివే 12వ తరగతి విద్యార్థులకు సీఈటీలో అవకాశం ఇచ్చామన్నారు. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ ఫలితాలు వెల్లడయ్యాయన్నారు. సీఈటీకి సంబంధించిన ‘కీ’ మంగళవారంలోగా కర్ణాటక పరీక్షా ప్రాధికార వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తామన్నారు. 30న ఫలితాలు ప్రకటిస్తామన్నారు. 

Updated Date - 2022-07-26T17:55:45+05:30 IST