5 రాష్ట్రాల ఎన్నికల తేదీలు ఇవే : ఈసీ

ABN , First Publish Date - 2022-01-08T21:52:42+05:30 IST

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర శనివారం ఢిల్లీలోని విజ్ఞాన్

5 రాష్ట్రాల ఎన్నికల తేదీలు ఇవే : ఈసీ

న్యూఢిల్లీ : చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర శనివారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ,  ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ శాసన సభ ఎన్నికల తేదీలను ప్రకటించారు. మొత్తం ఏడు దశల్లో ఈ ఎన్నికలు జరుగుతాయని, ఉత్తర ప్రదేశ్‌లో తొలి దశ పోలింగ్ ఫిబ్రవరి 10న జరుగుతుందని తెలిపారు. రెండో దశ పోలింగ్ ఫిబ్రవరి 14న, మూడో దశ పోలింగ్ ఫిబ్రవరి 20న, నాలుగో దశ పోలింగ్ ఫిబ్రవరి 23న, ఐదో దశ పోలింగ్ ఫిబ్రవరి 27న, ఆరో దశ పోలింగ్ మార్చి 3న, ఏడో దశ పోలింగ్ మార్చి 7న జరుగుతుందని చెప్పారు. ఓట్ల లెక్కింపు మార్చి 10న జరుగుతుందని తెలిపారు.


పంజాబ్, ఉత్తరాఖండ్, గోవాలలో పోలింగ్ ఫిబ్రవరి 14న జరుగుతుందని తెలిపారు. మణిపూర్‌లో పోలింగ్ ఫిబ్రవరి 27, మార్చి 3 తేదీల్లో రెండు దశల్లో జరుగుతుందని వివరించారు. 


Updated Date - 2022-01-08T21:52:42+05:30 IST