ఘనంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం

ABN , First Publish Date - 2021-12-04T05:09:32+05:30 IST

దివ్యాంగులైన చిన్నారులను చదువులో ప్రోత్సహించాలని మండల విద్యాశాఖ అధికారి శివరాములు అన్నారు.

ఘనంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం

ఆదోని(అగ్రికల్చర్‌), డిసెంబరు 3: దివ్యాంగులైన చిన్నారులను చదువులో ప్రోత్సహించాలని మండల విద్యాశాఖ అధికారి శివరాములు అన్నారు. శుక్రవారం పట్టణంలోని తిరుమలనగర్‌ భవిత కేంద్రంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఆటల పోటీలలో గెలుపొందిన దివ్యాంగుల చిన్నారులకు బహుమతి ప్రదానం చేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు ఎం.నిర్మలమ్మ, ఉపాధ్యాయుడు అయ్యప్ప, సదాపురం టీసీ ఇన్‌చార్జి హెచ్‌ఎం నిర్మలమ్మ, సచివాలయ సిబ్బంది వెంకటేశ్వరి, అజయ్‌, సీఆర్‌పీలు శాంతకుమార్‌, మౌనిక పాల్గొన్నారు.


ఎమ్మిగనూరు: విభిన్న ప్రతిభావంతుల పట్ల సానుభూతి చూపడానికి బదులు వారిని అన్ని విధాల ప్రోత్సహించాలని వైసీపీ సీనియర్‌ నాయకుడు జగన్మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని భవిత కేంద్రంలో ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన ఆయన చిన్నారులకు బ్యాగులు అందజేశారు. కార్యక్రమంలో మల్లెల ఆల్‌ఫ్రెడ్‌ రాజు, కోఆపరేటివ్‌ స్టోర్స్‌ చైర్మన్‌ షబ్బీర్‌ అహ్మద్‌, మైనార్టీ నాయకులు రియాజ్‌ అహ్మద్‌, కౌన్సిలర్‌ కేశవరెడ్డి, చాంద్‌, సిబ్బంది బాబు పాల్గొన్నారు.


మంత్రాలయం: మంత్రాలయం రాఘవేంద్రపురం పాఠశాలలో దివ్యాంగుల దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. శుక్రవారం ఎంఈవో మైనుద్దిన్‌, కళాశాల ప్రిన్సిపాల్‌ రమేష్‌ ఆటల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. సమావేశంలో ప్రధానోపాధ్యాయులు రామ్మోహన్‌, అంపయ్య, వీరేష్‌, సీఆర్‌పీలు నర్సనగౌడు, బంగారప్ప, భీమేష్‌, కళ్యాణి, మంజుల, నాగరాజునాయక్‌ పాల్గొన్నారు.


ఆలూరు: దివ్యాంగులు, ప్రత్యేక అవసరాలు గల పిల్లలు అధైర్యపడ వద్దని ఆలూరు జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల, బాలురు ఉన్నత పాఠశాల-2 ప్రధానోపాధ్యాయులు అరులమ్మ, కోమలదేవి సూచించారు. శుక్రవారం స్థానిక భవిత భవన్‌లో ప్రపంచ విభిన్న ప్రతిభవాంతుల దినోత్సవం సందర్భంగా విభిన్న ప్రతిభావంతులు వేసిన మహాత్మాగాంధీ, నెహ్రూ, భగత్‌సింగ్‌, భరతమాత, సరోజినీనాయుడు, ఛత్రపతి శివాజీల వేషధారణలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను వారు అందించారు.  ఈఈఆర్‌టీలు రామదాసు, అరుణజ్యోతి, రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు గోవిందప్ప, డిపెప్‌ పాఠశాల హెచ్‌ఎం బసవరాజు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-04T05:09:32+05:30 IST