భక్తిశ్రద్ధలతో మొహర్రం వేడుకలు

ABN , First Publish Date - 2022-08-10T06:14:27+05:30 IST

మొహర్రం వేడుకలను జిల్లా వ్యాప్తంగా మంగళవారం భక్తిశ్రద్ధలతో నిర్వహిం చారు. నాగారం మండలంలోని పస్తాల, నాగారం, ఈటూరు గ్రామాల్లో పీర్లను ఊరేగించారు.

భక్తిశ్రద్ధలతో మొహర్రం వేడుకలు
సూర్యాపేటలో పీర్లను ఊరేగింపు చేస్తూ మొహరం వేడుకలు నిర్వహిస్తున్న భక్తులు

నాగారం/ నడిగూడెం/ చిలుకూరు/ సూర్యాపేట కల్చరల్‌/ మఠంపల్లి/ తిరుమలగిరి/ తిరుమలగిరి రూరల్‌ ఆగస్టు 9: మొహర్రం వేడుకలను జిల్లా వ్యాప్తంగా మంగళవారం భక్తిశ్రద్ధలతో నిర్వహిం చారు. నాగారం మండలంలోని పస్తాల, నాగారం, ఈటూరు గ్రామాల్లో పీర్లను ఊరేగించారు. నడిగూడెం మండలంలోని సిరిపురం, రామాపురం, వల్లాపురం, కరవిరాల, కాగితరామచంద్రపురం గ్రామాల్లో పీర్లను ఊరేగించారు. చిలుకూరు మండలంలో మొహర్రం పండుగను ఘనంగా జరుపుకున్నారు. సూర్యాపేట జిల్లాకేంద్రంలో పీర్ల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. కుల మతాలకు అతీతంగా హిందూ, ముస్లింలు కలిసి మొహరం పండుగను నిర్వహించారు. పట్టణంలోని పలు వార్డుల్లో తొమ్మిది రోజుల నుంచి పీర్లను నెలకొల్పి పీర్లను డప్పు వాయిద్యాల నడుమ ఊరేగించారు. అనంతరం పీర్ల సవారీలను నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో ముతవల్లి మన్సూర్‌ అలీ, మేడబోయిన రాజు, చినమల్సూర్‌, అంతటి వెంకన్నగౌడ్‌, ఏలూరు వెంకన్న, అంతటి కృష్ణ, శంకర్‌, కృష్ణ, అనిల్‌, నరేష్‌, ఎల్గూరి చంటిబాబు పాల్గొన్నారు. జిల్లాకేంద్రంలోని పెద్దమసీద్‌ ప్రాంతంలోని పీర్ల సవారి కొట్టం వద్ద జరిగిన వేడుకల్లో వ్యవసాయ మార్కెట్‌ చైర్‌పర్సన్‌ ఉప్పల లలితాదేవిఆనంద్‌ పాల్గొన్నారు. మఠంపల్లి మం డలంలోని రఘునాథపాలెంలో ని ర్వహించిన పీర్ల ఊరేగింపులో హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో శానంపూడి శేఖర్‌రెడ్డి, ఇరుగు పిచ్చయ్య పాల్గొన్నారు. తిరుమలగిరిలో పీర్లను ఊరేగింపు నిర్వహిం చారు. తిరుమలగిరి మండలంలోని గుండెపురిలో కులమతాలకు అతీతంగా మొహర్రం పండుగను ఘనంగా జరుపుకున్నారు. కులా ల వారీగా సవార్లకు పేర్లు పెట్టుకొని ముజవార్లుగా కూడా హిందు వులే ఉంటూ వారం రోజుల పాటు ఈ వేడుకలను జరుపుకుం టున్నామని గ్రామస్థులు పాలకుర్తి శ్రీకాంత్‌, మద్దెల సోమయ్య, సై దులు, ఉప్పలయ్య, మహేష్‌, ఉపేందర్‌, లాలు, సందీప్‌ తెలిపారు.

Updated Date - 2022-08-10T06:14:27+05:30 IST