నిఖత్‌ గెలుపుతో సంబరాలు

ABN , First Publish Date - 2022-05-21T07:04:56+05:30 IST

జిల్లాకు చెందిన నిఖత్‌ జరీన్‌ ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌గా నిలవడంపై జిల్లాలోని క్రీడాభిమానులు శుక్రవారం సంబురాలు చేసుకున్నారు. జిల్లా బాక్సింగ్‌ అసొసియేషన్‌, జిల్లా స్పోర్ట్స్‌ అథారిటీ ఆధ్వర్యంలో నగరంలోని డీఎస్‌ఏ మైదానంలో క్రీడాభిమానులు టపాసులు పేల్చి తమ ఆనందా న్ని వ్యక్తం చేశారు.

నిఖత్‌ గెలుపుతో సంబరాలు
నగరంలో బాణాసంచా కాలుస్తున్న బాక్సింగ్‌ క్రీడాకారులు

బాణాసంచా పేల్చి క్రీడాకారుల ఆనందం 

నిజామాబాద్‌లో బాక్సింగ్‌ అకాడమీ ఏర్పాటు చేయాలి

బాక్సింగ్‌ అసోసియేషన్‌ జిల్లా సెక్రెటరీ శంషుద్దీన్‌ 

సుభాష్‌నగర్‌, మే 20: జిల్లాకు చెందిన నిఖత్‌ జరీన్‌ ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌గా నిలవడంపై జిల్లాలోని క్రీడాభిమానులు శుక్రవారం సంబురాలు చేసుకున్నారు. జిల్లా బాక్సింగ్‌ అసొసియేషన్‌, జిల్లా స్పోర్ట్స్‌ అథారిటీ ఆధ్వర్యంలో నగరంలోని డీఎస్‌ఏ మైదానంలో క్రీడాభిమానులు టపాసులు పేల్చి తమ ఆనందా న్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా బాక్సింగ్‌ అసోసియేషన్‌ సెక్రెటరీ, నిఖత్‌ జరీన్‌ తొలి గురువు శంషుద్దీన్‌ విలేకరుల తో మాట్లాడుతూ.. తాను స్వతహాగా బా క్సింగ్‌ క్రీడాకారుడినన్నారు. తాను చేయలేకపోయిన పనిని.. తన శిష్యులతో చేయించాలన్న పట్టుదలతో అందరికీ తర్ఫీదునిచ్చానని తెలిపారు.  జిల్లా నుంచి మొత్తం ఏడుగురిని అంతర్జాతీయ బాక్సింగ్‌ ప్లేయర్స్‌ను తయారు చేశానన్నారు. నిఖత్‌ కూడా పట్టుదలగా.. అబ్బాయిలతో పాటు సాధన చేస్తూ క్రమశిక్షణగా మెలిగేదని ఆయన గుర్తుచేశారు. దీనిలో భాగంగా నాలుగు సంవత్సరాల పాటు నిఖత్‌కు శిక్షణ ఇచ్చానన్నారు. బాక్సింగ్‌కు మారుపేరుగా ఉన్న నిజామాబాద్‌లో బాక్సింగ్‌ అకాడమీని ఏర్పాటు చేయాలని శంషుద్దీన్‌ ప్రభుత్వాన్ని కోరారు. ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌గా నిలిచిన నిఖత్‌ జరీన్‌ను హృదయపూర్వకంగా అభినందిస్తున్నట్టు తెలిపారు. అనంతరం జిల్లా క్రీడా, యువజనల శాఖాధికారి ముత్తన్న మాట్లాడుతూ.. 2011 నుంచి 2022వరకు నిఖత్‌ జరీన్‌ అంచెలంచెలుగా ఎదుగుతూ ముందుకెళ్లిందన్నారు. ఫిజికల్‌గా ఎంతో కష్టపడి తేనే ఆస్థాయికి వెళ్లగలమన్నారు. రానున్న రోజుల్లో ఒలంపిక్‌ పతకం సాధించాలని ఆకాంక్షించారు. జిల్లాలో ప్రతీ ఒక్క గేమ్‌లో జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు ఉన్నారని.. కానీ సరైన కోచ్‌లు లేకపోవడంతో ఇబ్బందిగా ఉందన్నారు. తెలంగాణ స్పోర్ట్స్‌ అథా రిటీ ఈ వి షయాన్ని గుర్తించి.. బాక్సింగ్‌ అకాడమీని ఏర్పాటు చేయాల ని కోరారు. సమావేశంలో సీనియర్‌ బాక్సింగ్‌ క్రీడాకారులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-21T07:04:56+05:30 IST