శ్రీవారి సేవలో ప్రముఖులు

Jul 26 2021 @ 00:53AM
జస్టిస్‌ వైద్యనాథన్‌ - రాజేంద్రప్రసాద్‌ - మంచు విష్ణు

తిరుమల, జూలై 25 (ఆంధ్రజ్యోతి): శ్రీవేంకటేశ్వరస్వామిని ఆదివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తమిళనాడు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వైద్యనాథన్‌, అరబిందో ఫార్మసీ చైర్మన్‌ మధుసూదన్‌రెడ్డి, పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు ఎమ్మెల్యే జి.శ్రీనివాస్‌ నాయుడు, సినీనటులు రాజేంద్రప్రసాద్‌, మంచు విష్ణు తదితరులు ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి, లడ్డూప్రసాదాలు అందజేశారు. దర్శనానంతరం రాజేంద్రప్రసాద్‌ మీడియాతో మాట్లాడుతూ.. లోక కల్యాణంకోసం టీటీడీ నిర్వహిస్తున్న సుందరకాండ ముగింపు కార్యక్రమంతోపాటు బాలకాండ పారాయణం ప్రారంభంలో తాను పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు. త్వరలో థియేటర్లు ప్రారంభం కావాలని, సినిమా చూసే భాగ్యం అందరికీ కలగాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ప్రతి ఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు పాటించాలని సూచించారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.