
ఎన్నారై డెస్క్: ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయుల విషయంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక ప్రకటన చేసింది. ఇప్పటి వరకు ఇండియాకు తరలించిన భారతీయుల సంఖ్యతోపాటు.. ఇంకా అక్కడ ఎంత మంది ఉన్నారనే విషయంపై స్పష్టత ఇచ్చింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
విదేశాంగశాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖీ బుధవారం రాజ్యసభలో మాట్లాడుతూ.. ‘ఆపరేషన్ గంగా’ ద్వారా ఇప్పటి వరకు ఉక్రెయిన్ నుంచి 22,500 మంది భారత్కు తరలించినట్టు చెప్పారు. అంతేకాకుండా ఇంకా సుమారు 50 మంది బారతీయ విద్యార్థులు ఉక్రెయిన్లోనే ఉన్నట్టు వెల్లడించారు. వాళ్లకు కూడా స్వదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి