ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్రం

ABN , First Publish Date - 2022-07-02T06:49:07+05:30 IST

కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కా ర్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి ఇందూరి సాగర్‌, ఐఎ్‌ఫటీయూ జిల్లా కార్యదర్శి బొమ్మిడి నగేష్‌ అన్నారు.

ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్రం
జీవో కాపీలను దహనం చేస్తున్న నాయకులు

నల్లగొండటౌన, జూలై 1: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కా ర్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి ఇందూరి సాగర్‌, ఐఎ్‌ఫటీయూ జిల్లా కార్యదర్శి బొమ్మిడి నగేష్‌ అన్నారు. శుక్రవారం పట్టణంలోని సుభాష్‌ విగ్రహం ఎదుట చట్టాలను మార్చేందుకు విడుద ల చేసిన జీవో ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ కార్మిక సంక్షేమాన్ని విస్మరించి 44 లేబర్‌ కోడ్‌లను నాలుగు కోడ్‌లుగా కుదించి కార్మిక రంగాన్ని నిర్వీర్యం చేసిం దని విమర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రిటీష్‌ కాలం నుంచి కొనసాగుతూ వస్తున్న కార్మిక అనుకూల చట్టాలను రద్దు చేసి, కార్మిక వ్యతిరేక చట్టాలను మోదీ ప్రభుత్వం తీసుకురావ డం అప్రజాస్వామికయని పేర్కొన్నారు. అనేక పోరాటాలు, ప్రాణత్యాగాల ద్వారా సాధించుకున్న 8 గంటల పనిదినాలను రద్దు చేసి 12గంటల పనిదినాలను అమల్లోకి తీసుకురావడం శ్రమదోపిడీ చే యడమేనని పేర్కొన్నారు. కార్మికుల ఆందోళన, ఆవేదనను కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోకుండా ఇలాంటి చట్టాలను తీసుకురావడం మోదీ నిరంకుశ, నియంతృత్వ విధానాలకు నిదర్శనమన్నా రు. కార్యక్రమంలో ఐఎ్‌ఫటీయూ నాయకుడు జానపాటి శంకర్‌, నాయకులు బొంగరాల నర్సింహ, చింతల వెంకటరమణ, కల్లూరి అయోద్య, కత్తుల చంద్రశేఖర్‌, దాసరి నర్సింహ, అక్కెనపల్లి అంజి, నర్సింహ, నాగరాజు, స్వామి తదితరులు ఉన్నారు. 


Updated Date - 2022-07-02T06:49:07+05:30 IST