Telanganaలో ఉప్పుడు బియ్యం సేకరణకు కేంద్రం ఆమోదం

ABN , First Publish Date - 2022-08-11T19:04:20+05:30 IST

తెలంగాణలో ఉప్పుడు బియ్యం సేకరణకు కేంద్రం ఆమోదం తెలిపింది.

Telanganaలో ఉప్పుడు బియ్యం సేకరణకు కేంద్రం ఆమోదం

ఢిల్లీ/ హైదరాబాద్: తెలంగాణ (Telangana)లో ఉప్పుడు బియ్యం సేకరణకు కేంద్రం (Central government) ఆమోదం తెలిపింది. 2021-22 రబీ సీజన్‌లో పండించిన 8లక్షల మెట్రిక్ టన్నుల ఉప్పుడు బియ్యం సేకరణకు సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌‌కు కేంద్ర మంత్రిత్వ శాఖ లేఖ రాసింది. గతంలో ఇచ్చిన 6.05లక్షల మెట్రిక్ టన్నులకు అధనంగా బియ్యం సేకరించాలని నిర్ణయించినట్లు కేంద్రం లేఖలో పేర్కొంది. ఇందుకు అనుగుణంగా ఎఫ్‌సీఐ చర్యలు తీసుకుంటుందని వెల్లడింది. ఉప్పుడు బియ్యం విషయంలో కేంద్ర నిర్ణయంపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan reddy) హర్షం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra modi)తో పాటు కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ మంత్రి పియూష్ గోయల్‌కు ధన్యవాదాలు తెలుపుతూ కిషన్‌రెడ్డి ప్రకటనను విడుదల చేశారు. 


Updated Date - 2022-08-11T19:04:20+05:30 IST