నేటి నుంచి కేంద్రం కోటా రేషన్‌

ABN , First Publish Date - 2022-01-18T06:31:32+05:30 IST

కరోనా విపత్కర పరిస్థితుల్లో తెల్ల కార్డుదారులకు కేంద్రప్రభుత్వం ఉచితంగా ఇచ్చే బియ్యాన్ని మంగళవారం నుంచి జిల్లావ్యాప్తంగా పంపిణీ చేసేందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు.

నేటి నుంచి కేంద్రం కోటా రేషన్‌

రెండు నెలల బియ్యం ఒకేసారి కార్డుదారులకు అందజేత

ఒంగోలు(కలెక్టరేట్‌), జనవరి 17: కరోనా విపత్కర పరిస్థితుల్లో తెల్ల కార్డుదారులకు కేంద్రప్రభుత్వం ఉచితంగా ఇచ్చే బియ్యాన్ని మంగళవారం నుంచి జిల్లావ్యాప్తంగా పంపిణీ చేసేందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. గత నెల నుంచి రేషన్‌ పంపిణీని పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. అందుకు సంబంధించిన బియ్యం అందుబాటులో లేకపోవడంతో డిసెంబర్‌లో కార్డుదారులకు ఇవ్వలేదు. అయితే జనవరి కోటాతో కలిపి గత నెల బియ్యం కూడా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నారు. జిల్లావ్యాప్తంగా 9,86,690 రేషన్‌కార్డులు ఉండగా ఒక్కొక్కరికి పదికిలోల బియ్యం చొప్పున చౌక ధరల దుకాణాల్లో అందజేయనున్నారు. 

Updated Date - 2022-01-18T06:31:32+05:30 IST