
నల్లగొండ: రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇతర సంస్థలు తెలంగాణకు విద్యుత్ విక్రయించొద్దని కేంద్ర ప్రభుత్వం బెదిరిస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ సరఫరాను అడ్డుకుంటూ తెలంగాణ అభివృద్ధికి కేంద్రం మోకాలడ్డుతోందని ఆరోపించారు. రాష్ట్రానికి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ సంస్థలు రుణం ఇవ్వకుండా కేంద్రం అడ్డుకుంటూ తెలంగాణపై కక్షపూరిత వైఖరి ప్రదర్శిస్తోందన్నారు. రోజురోజుకూ పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు తగ్గట్టు సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 17వేల మెగావాట్లకు పైగా విద్యుత్ డిమాండ్ వచ్చినా సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని జగదీష్‌రెడ్డి తెలిపారు.
ఇవి కూడా చదవండి