గిరిజనుల హక్కులను కాలవాస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

ABN , First Publish Date - 2022-05-23T04:07:10+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసుల హక్కులను కాలరాస్తున్నాయని సీపీఎం జిల్లా కార్యదర్శి సంకె రవి అన్నారు. దండేపల్లి మండలం మాకులపేట పంచాయతీ పరిధిలో కోయ్య పోచగూడ గిరిజనులతో ఆదివారం సమావేశం నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ ఆదివాసి గిరిజనులకు సాగుభూములు లేకుండా చేయడానికే గిరిజనులపై అటవీ శాఖ అధికారులు అక్రమంగా కేసులు పెడు తూ వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.

గిరిజనుల హక్కులను కాలవాస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
కోయ్యపోచగూడ గిరిజనులతో మాట్లాడుతున్న సీపీఐ నాయకులు

దండేపల్లి, మే 22: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసుల హక్కులను కాలరాస్తున్నాయని సీపీఎం జిల్లా కార్యదర్శి సంకె రవి అన్నారు. దండేపల్లి మండలం మాకులపేట పంచాయతీ పరిధిలో కోయ్య పోచగూడ గిరిజనులతో ఆదివారం సమావేశం నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ ఆదివాసి గిరిజనులకు సాగుభూములు లేకుండా చేయడానికే గిరిజనులపై అటవీ శాఖ అధికారులు అక్రమంగా కేసులు పెడు తూ వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. వారిపై పెట్టిన కేసులన్ని వెంటనే ఎత్తివేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. 2006లో అటవీ హక్కుల చట్టానికి విరుద్ధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అటవీ శాఖ అధికా రులు గిరిజనులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం పోడుభూములకు పట్టాలను ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కోయ్యపోచగూడ చెందిన మహిళలని చూడకుండా 35మందిపై ఇప్పటికే కేసులు నమోదు చేశారన్నారు. అటవీ హక్కుల చట్టం పోడు సాగుదారులకు హక్కుల పత్రాలు ఇచ్చి సమస్యలు పరిష్కరించేలా చూడాలని కలెక్టర్‌, ఐటీడీఏ పీవోలను కలిసి  వినతిపత్రాలను సమర్పించారన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కనికారపు అశోక్‌, తెలంగాణ వ్యవసాయ కార్మిక జిల్లా అధ్యక్షుడు ఫరంగి జైలు, ఆదివాసి గిరిజనులు పాల్గొన్నారు.    

కృష్ణాకాలనీలో సీపీఐ బస్తీ సమావేశం

నస్పూర్‌: నస్పూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని కృష్ణాకాలనీ నాల్గొవ వార్డులో సీపీఐ ఆధ్వర్యంలో ఆదివారం బస్తీ సమావేశం జరిగింది. నాయకులు మాట్లాడుతూ కాలనీలో మంచినీటి సమస్య పరిష్కరించడంలో పాలకులు విఫలం చెందారని ఆరోపించారు. మురుగు నీరు సరఫరా అవుతోందని, సింగరేణి అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా పరిష్కారంలో జాప్యం జరుగుతుందన్నారు. వచ్చే నెల 4,5 తేదీల్లో నస్పూర్‌ మండల మహాసభ జరుగుతుందని తెలిపారు. బస్తీ సమావేశంలో కమిటీని ఎన్నుకున్నారు. సీపీఐ మండల కార్యదర్శి జోగుల మల్లయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు కారుకూరి నగేష్‌, నాయకులు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-23T04:07:10+05:30 IST