Cyberabad: కమీషనరేట్‌ పరిధిలోని సెంట్రల్ బ్యాంక్‌లో చోరీకి విఫలయత్నం

ABN , First Publish Date - 2021-09-09T16:08:00+05:30 IST

సైబరాబాద్ కమీషనరేట్‌‎కు కూతరేటు పరిధిలో ఉన్న సెంట్రల్ బ్యాంక్‌లో గుర్తు తెలియని దుండగులు చోరీకి యత్నించారు. కిటికీ గ్రీల్ తొలగించి లోనికి ప్రవేశించారు. అయితే.. స్ట్రాంగ్‌ రూం ఎంతకు

Cyberabad: కమీషనరేట్‌ పరిధిలోని సెంట్రల్ బ్యాంక్‌లో చోరీకి విఫలయత్నం

హైదరాబాద్: సైబరాబాద్ కమీషనరేట్‌‎కు కూతరేటు పరిధిలో ఉన్న సెంట్రల్ బ్యాంక్‌లో గుర్తు తెలియని దుండగులు చోరీకి యత్నించారు. కిటికీ గ్రీల్ తొలగించి లోనికి ప్రవేశించారు. అయితే.. స్ట్రాంగ్‌ రూం ఎంతకు తెరుచుకోకపోవడంతో బ్యాంక్‌లో ఉన్న హార్డ్ డిస్కులతో దుండుగులు పరారయ్యారు. ఉదయం బ్యాంక్ తెరచిన సిబ్బంది విషయం గమనించి రాయదుర్గం పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్లూస్ టీం, డాగ్‌ స్వ్కాడ్‌లతో రాయదుర్గం పోలీసులు రంగంలోకి దిగారు. ఇద్దరు వ్యక్తులు చోరీకి యత్నించి ఉంటారని పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2021-09-09T16:08:00+05:30 IST