ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం కొర్రీలు

Published: Mon, 28 Mar 2022 00:41:36 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం కొర్రీలుసమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు

- ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు 

సుల్తానాబాద్‌, మార్చి 27: యాసంగి దాన్యం కొను గోళ్ళ విషయంలో కేంద్రం అనేక కొర్రీలు పెడుతోందని, రాష్ట్ర రైతాంగాన్ని ఆందోళనలో పడవేస్తుందని, కరీం నగర్‌ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఇంటి ముందు ధాన్యం కుప్పలు పోయాలని ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు రైతాంగానికి పిలుపునిచ్చారు. సు ల్తానాబాద్‌ మండలంలోని నారాయణపూర్‌ గ్రామంలో దాదాపు 35 లక్షలతో నిర్మించిన గోదాములను ఎంఎల్‌ సీతో పాటు ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, రాష్ట్ర, జా తీయ సహకార సమాఖ్యల అధ్యక్షుడు కొండూరు ర వీందర్‌రావుతో కలసి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రైతులను ద్ధేశించి ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు మాట్లాడుతూ ధా న్యం కొనుగోళ్ల విషయంలో బండి సంజయ్‌ మాట్లాడుతూ కేంద్రం కొనుగోలు చేస్తుందని ప్రకటించారని,విధానపరంగా ఓ పద్ధతి ప్రకా రంగా వీరు మాట్లాడడం లేదన్నారు. అయితే కేంద్రం దాన్యం కొను గోలుకు సుముఖత వ్యక్తం చేయని సందర్భంలో రైతులు తమ ధా న్యంను బండి సంజయ్‌ ఇంటి ముందు, అటు నిజామాబాద్‌ ఎంపీ అరవింద్‌ల ఇండ్ల ముందు కుప్పలు పోయాలన్నారు. సహకార రం గంలో కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో కేడీసీసీబీ, ముల్కనూర్‌ సొసైటీ, కరీంనగర్‌ డెయిరీ సొసైటీలు సమర్ధవంతంగా కొనసాగుతున్నాయ న్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలోని 51 సింగిల్‌ విండోల ద్యారా సహకార బ్యాంకులు దాదాపు 5 వేల కోట్లకు పైగా రుణాలను రైతులకు ఇచ్చిందని సహకార సంఘాల సమాఖ్య జాతీ య ధ్యక్షులు కొండూరు రవీందర్‌రావు అన్నారు. 13 బ్యాంకులకు స్వంత భవనాలున్నాయని సుల్తానాబాద్‌లో కూడా స్థలం కేటాయిస్తే భవనం నిర్మి స్తామన్నారు. సహకార వ్యవస్థ ఒక ఉన్నతమైన లక్ష్యంతో ఏర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్యే దాస రి మనోహర్‌ రెడ్డి అన్నారు. చిన్నకలువల సుల్తానాబాద్‌ సంఘాలు రైతుల సంక్షేమం అబివృద్దే లక్ష్యంగా పని చేస్తున్నాయన్నారు. సహ కార రంగంలో ఉన్నతమైన జాతీయస్థాయి పదవిలో ఉండడం తె లంగాణకు గర్వకారణమన్నారు. కేడీసీసీబీ డైరక్టర్‌ దేవరనేని మో హన్‌ రావు, రైతు బందు జిల్లా అద్యక్షులు కాసర్ల అశోక్‌ రెడ్డి, జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ మండిగ రేణుక, ఎంపీపీ బాలాజీరావు, కేడీసీసీబీ డైరక్టర్‌ శ్రీగిరి శ్రీనివాస్‌, మార్కెట్‌ కమిటీ అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్‌ గౌడ్‌, కేడీసీసీబీ సీఈఓ సత్యనారాయణరావు, సొసైటీ అద్యక్షులు సందీప్‌రావు, బాస్కర్‌ రెడ్డి,మహిపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.