Telangana BJP కేంద్ర ఎన్నికల సంఘం షాక్..

ABN , First Publish Date - 2022-08-11T18:46:30+05:30 IST

తెలంగాణ బీజేపీ(Telangana BJP)కి కేంద్ర ఎన్నికల కమిషన్(Central Election commission) ఝలక్ ఇచ్చింది. ‘సాలు దొర‌-సెలవు దొర’ ప్రకటనలపై నిషేధం విధించింది.

Telangana BJP కేంద్ర ఎన్నికల సంఘం షాక్..

న్యూఢిల్లీ : తెలంగాణ బీజేపీ(Telangana BJP)కి కేంద్ర ఎన్నికల కమిషన్(Central Election commission of India) ఝలక్ ఇచ్చింది. ‘సాలు దొర‌-సెలవు దొర’ ప్రకటనలపై నిషేధం విధించింది. కేసీఆర్‌(KCR)కు వ్యతిరేకంగా ‘సాలు దొర- సెలవు దొర’ అంటూ పోస్టర్లు ముద్రించడానికి ఎన్నికల కమిషన్ అనుమతి నిరాకరించింది. రాజకీయ పార్టీలకు చెందిన నేతలను కించపరిచేవిధంగా పోస్టర్లు, ఫోటోలు, రాతలు ఉండకూడదని ఖరాఖండీగా ఎన్నికల కమిషన్ తెలిపింది. సాలు దొర-సెలవు దొర క్యాంపెయిన్‌కు ఎన్నికల కమిషన్ మీడియా సర్టిఫికేషన్ కమిటీ అనుమతి నిరాకరించింది. సాలు దొర-సెలవు దొర క్యాంపెయిన్‌కు అనుమతి కోరుతూ మీడియా సర్టిఫికేషన్ కమిటీకి బీజేపీ దరఖాస్తు చేసుకుంది. బీజేపీ విజ్ఞప్తిని కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చింది.


కొద్ది రోజుల క్రితం ‘సాలు దొర - సెలవు దొర’ అంటూ బీజేపీ కార్యాలయం వెలుపల కొన్ని ప్రకటనలు వెలిశాయి. తెలంగాణ ప్రభుత్వ తీరును ఎండగడుతూ ఈ ప్రకటన బాగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా సీఎం కేసీఆర్ పలు సందర్భాల్లో చెప్పిన మాటలు.. అభివృద్ధి పనులను చేస్తానని చెప్పి చేయలేకపోయినవి.. మ్యానిఫెస్టో.. ఇంటికో ఉద్యోగం..  కేజీ టు పీజీ ఉచిత విద్య.. జిల్లాకో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి.. ముఖ్యమంత్రిగా దళితుడు, మూడెకరాల భూమి పంపకం, దళితబంధు.. గిరిజనులకు ఇస్తనన్న పన్నెండు శాతం రిజర్వేషన్లు.. ఈ అంశాలన్నింటినీ గుర్తు చేస్తూ.. ఇవేమీ చేయలేదని నిందిస్తూ ‘సాలు దొర.. సెలవు దొర!’ ప్రకటనను బీజేపీ వైరల్ చేసింది.


Updated Date - 2022-08-11T18:46:30+05:30 IST