
నల్లగొండ: ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం రాజకీయం చేస్తోందని మంత్రి జగదీష్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పంజాబ్ తరహాలో రాష్ట్రంలో కూడా కేంద్రమే ధాన్యం కొనుగోలు చేయాలని కోరితే వివక్ష చూపుతోందన్నారు. ధాన్యం కొనుగోలు విషయమై మంత్రులు ఇటీవల ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రిని కలిస్తే ఆయన అవమానకరంగా మాట్లాడారని తెలిపారు. పంజాబ్ కంటే రాష్ట్రంలో అత్యధికంగా ధాన్యం దిగుబడులు వస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వమే దొడ్డు రకం విత్తనాలను ప్రవేశపెట్టిందని, దొడ్డురకం, బాయిల్డ్‌రైస్ అంటూ ఇప్పుడు కుంటి సాకులు చెబుతూ ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయడంలేదని ఆరోపించారు. దొడ్డురకం ధాన్యం సాగు చేయొద్దని కేంద్ర ప్రభుత్వం కోరితే, రాష్ట్రంలోని బీజేపీ నాయకులు దొడ్డు రకం సాగు చేయాలని రైతులను రెచ్చగొట్టారని తెలిపారు. రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసేంతవరకు ఒత్తిడి తెస్తామని జగదీష్‌రెడ్డి ప్రకటించారు.
ఇవి కూడా చదవండి