కేంద్ర ప్రభుత్వం నుంచి TTDకి లేఖ.. నెల రోజుల్లో పంపండి!

ABN , First Publish Date - 2021-09-14T12:38:36+05:30 IST

టీటీడీకి ఆసక్తి లేదని భావించాల్సి వస్తుందని పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం నుంచి TTDకి లేఖ.. నెల రోజుల్లో పంపండి!

తిరుపతి : టీటీడీ నిర్వహిస్తున్న ఎస్వీబీసీ ఛానల్‌కు అనుబంధంగా కన్నడ, హిందీ ఛానళ్లకు అనుమతి ఇవ్వటానికి ఒక్కోదానికి రూ.కోటి బ్యాంకు గ్యారెంటీని నెల రోజుల్లో పంపాలని కేంద్ర ఇన్ఫర్మేషన్‌ అండ్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ మంత్రిత్వ శాఖ కార్యదర్శి విజయ్‌ కౌశిక్‌ టీటీడీకి సోమవారం లేఖ పంపారు. లేదంటే ఛానల్‌ అనుమతుల పట్ట టీటీడీకి ఆసక్తి లేదని భావించాల్సి వస్తుందని పేర్కొన్నారు. 2020 డిసెంబరు 10వ తేదీ టీటీడీ ఎస్వీబీసీ- 3 కన్నడ, ఎస్వీబీసీ- 4 హిందీకి అనుమతి ఇవ్వాలని కోరింది. దీనిపై స్పందించిన ఇన్ఫర్మేషన్‌ అండ్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ శాఖ ఈ మేరకు లేఖ పంపింది. దాంతో పాటు ఒక్కో ఛానల్‌‌కు అప్‌ లింకింగ్‌, డౌన్‌ లింకింగ్‌ అనుమతి కోసం ఏడు లక్షలు వంతున మొత్తం 14 లక్షలు చెల్లించాలని అని కూడా తెలిపింది.

Updated Date - 2021-09-14T12:38:36+05:30 IST