జీఎస్‌టీలోకి పెట్రోలియం ఉత్పత్తులు..?

ABN , First Publish Date - 2021-03-01T02:25:51+05:30 IST

దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు మళ్లీ ఆకాశాన్ని తాకుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మళ్లీ ఒకప్పటి ప్రతిపాదన మళ్లీ తెరమీదకొచ్చింది. అదే పెట్రోల్, డీజిల్ వంటి పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి..

జీఎస్‌టీలోకి పెట్రోలియం ఉత్పత్తులు..?

న్యూఢిల్లీ: దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు మళ్లీ ఆకాశాన్ని తాకుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మళ్లీ ఒకప్పటి ప్రతిపాదన మళ్లీ తెరమీదకొచ్చింది. అదే పెట్రోల్, డీజిల్ వంటి పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి చేర్చడం. కేంద్ర స్థాయిలో తాజా పరిణామాలు చూస్తుంటే త్వరలో పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకొస్తున్నట్లు కేంద్రం ప్రకటించినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని అనిపిస్తోంది. కేంద్ర ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రహ్మణియన్ ఆదివారం చేసిన వ్యాఖ్యలు ఈ అనుమానాలకు మరింత ఊతం ఇస్తున్నాయి.


ఫిక్కీ ఎఫ్‌ఎల్‌ఓ(మహిళా విభాగం) ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో సుబ్రహ్మణియన్ మాట్లాడారు. పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకువచ్చే ప్రతిపాదనకు తాను మద్దతు తెలుపుతున్నట్లు సుబ్రహ్మణియన్ పేర్కొన్నారు. అయితే దీనిపై నిర్ణయం జీఎస్‌టీ కౌన్సిల్‌ మాత్రమే తీసుకుంటుందని అన్నారు. ‘పెట్రోలియం ఉత్పత్తులను వస్తు సేవల పన్ను(జీఎస్‌టీ)పరిధిలోకి తీసుకురావడం మంచి ప్రతిపాదన. అయితే, దీనిపై నిర్ణయాధికారం మాత్రం జీఎస్‌టీ కౌన్సిల్‌దే’ అని కేవీ సుబ్రమణియన్‌ అన్నారు. ఆహార ద్రవ్యోల్బణం కారణంగా దేశంలో ద్రవ్యోల్బణ పరిస్థితులు పెరిగాయని అభిప్రాయపడ్డారు.


ఈ మధ్యనే కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా దీనిపై ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కోరారు. ఇప్పుడు ఆర్థిక సలహాదారు సుబ్రహ్మణియన్ కూడా అలాంటి వ్యాఖ్యలే చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే జీఎస్‌టీ కౌన్సిల్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Updated Date - 2021-03-01T02:25:51+05:30 IST