Bjp focused AP capital: వెయ్యి రోజుల రైతుల ఉద్యమం కేంద్రాన్ని కదిలించిందా?

ABN , First Publish Date - 2022-09-14T01:20:09+05:30 IST

ఒక్క రాజధానికే నిధులిస్తామని కేంద్ర ప్రభుత్వం (Central Govt.) స్పష్టం చేసింది. రాష్ట్ర విభజన అంశాలపై ..

Bjp focused AP capital: వెయ్యి రోజుల రైతుల ఉద్యమం కేంద్రాన్ని కదిలించిందా?

న్యూఢిల్లీ(Delhi): ఒక్క రాజధానికే నిధులిస్తామని కేంద్ర ప్రభుత్వం (Central Govt) స్పష్టం చేసింది. రాష్ట్ర విభజన అంశాలపై ఈనెల 27న కేంద్ర హోంశాఖ సమావేశంకానుంది. విభజన చట్టం ప్రకారం రాజధానికి కేంద్రం సహకారంపై సమావేశంలో చర్చించనున్నారు. కొత్త రాజధానికి నిధులు అని మాత్రమే కేంద్ర హోంశాఖ అజెండాలో తెలిపింది. మూడు రాజధానులపై అజెండాలో ప్రస్తావనే లేదు. పదే పదే మూడు రాజధానులని చెబుతున్న జగన్మోహన్ రెడ్డికి కేంద్రం షాకిచ్చిందనే చెప్పవచ్చు. గతంలో ఏపీ హైకోర్టు.. రాజధానిగా అమరావతే ఉంటుందని తీర్పు ఇచ్చినప్పటికీ.. ఈ నెలలో ప్రారంభంకాబోతున్న అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానులకు సంబంధించి బిల్లు పెడతామని చెబుతున్న సీఎం జగన్‌కు కేంద్రం షాకిచ్చింది.


ఈ నేపథ్యంలో ‘‘ఏపీ రాజధాని నిర్మాణంపై కేంద్రం దృష్టి సారించిందా?. అమరావతిలో నిర్మించే రాజధానికి మాత్రమే నిధులు ఇస్తారా?. వెయ్యి రోజుల రైతుల ఉద్యమం కేంద్రాన్ని కదిలించిందా?. పాదయాత్ర మొదలవ్వగానే కేంద్రం స్పందించడం దేనికి సంకేతం?. రెండు రాష్ట్రాల సమస్యల పరిష్కారం కొలిక్కి వస్తుందా?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 




Updated Date - 2022-09-14T01:20:09+05:30 IST