కరోనా కొత్త వేరియంట్...రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్!

ABN , First Publish Date - 2021-11-26T03:31:02+05:30 IST

బోత్సువానా, దక్షిణాఫ్రికా, హాంకాంగ్ దేశాలలో కొత్తగా ఉనికిలోకొచ్చిన బీ.1.1.529 కొవిడ్ వేరియంట్స్ గురించి హెచ్చరిస్తూ కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ గురువారం రాష్ట్రాలకి ఒక లేఖ రాశారు.

కరోనా కొత్త వేరియంట్...రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్!

న్యూఢిల్లీ: బోత్సువానా, దక్షిణాఫ్రికా, హాంకాంగ్ దేశాలలో కొత్తగా ఉనికిలోకొచ్చిన బీ.1.1.529 కొవిడ్ వేరియంట్స్ గురించి హెచ్చరిస్తూ కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ గురువారం రాష్ట్రాలకి ఒక లేఖ రాశారు. ఈ వేరియంట్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు సూచించారు. అంతర్జాతీయ ప్రయాణికులు ముఖ్యంగా.. బోత్సువానా, దక్షిణాఫ్రికా, హాంకాంగ్ దేశాల నుంచి లేదా.. ఆయా దేశాల మీదుగా భారత్‌కు వచ్చిన ప్రయాణికుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, వారిని క్షుణ్ణంగా తనిఖీ చేసి పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ఈ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న ఇతర దేశాల ప్రయాణికుల విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలని లేఖలో పేర్కొన్నారు. ఈ కొత్త వైరస్ మునుపటి వేరియంట్ల కంటే అధికంగా మార్పులు సంతరించుకుందని,  దీని వల్ల ప్రజారోగ్యంపై పెను ప్రభావం పడే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. 





Updated Date - 2021-11-26T03:31:02+05:30 IST