రూ.4.71 కోట్లతో సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు

ABN , First Publish Date - 2022-01-26T05:09:44+05:30 IST

రూ.4.71 కోట్లతో సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు

రూ.4.71 కోట్లతో సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు
పనులను పరిశీలిస్తున్న మున్సిపల్‌ చైర్మన్‌ రాంపాల్‌ నాయక్‌

ఆమనగల్లు, జనవరి 25: పట్టణంలో శ్రీశైలం-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై ఎన్‌హెచ్‌ఏఐ ఆధ్వర్యంలో సెంట్రల్‌ లైటింగ్‌ పనులు ప్రారంభమయ్యాయి. జాతీయ రహదారిపై సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేయాలని ఎంతోకాలంగా స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు, ప్రయాణికులు ప్రభుత్వాలను కోరుతున్నారు. ఇటీవల జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు తల్లోజు ఆచారి, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డిలు కేంద్ర రవాణాశాఖ మంత్రి నితీశ్‌గడ్కరీకి నిధుల మంజూరుకు అభ్యర్థించారు. స్థానిక ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌యాదవ్‌, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కూడా సెంట్రల్‌లైటింగ్‌ ఏర్పాటుకు పలుమార్లు సంబంధిత అదికారులను కోరారు. ఈనేపథ్యంలో కేంద్రప్రభుత్వం జాతీయ రహదారుల ఆథారిటీ ద్వారా కందుకూరు, కడ్తాల్‌, మైసిగండి, ఆమనగల్లు, వెల్దండ, కొట్ర, డిండి వద్ద సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటుకు రూ.4.71కోట్లు విడుదల చేసింది. దీంతో ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు సెంట్రల్‌ లైటింగ్‌ పనులను ప్రారంభించారు. ఆమనగల్లు పట్టణంలో జరుగుతున్నసెంట్రల్‌ లైటింగ్‌ పనులను మంగళవారం మున్సిపల్‌ చైర్మన్‌ రాంపాల్‌ నాయక్‌, వైస్‌చైర్మన్‌ దుర్గయ్యలు పరిశీలించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, నాయకులు చెక్కాల లక్ష్మణ్‌, తల్లోజు విజయ్‌కృష్ణ, గోరటి నర్సింహా, బైకని శ్రీశైలం యాదవ్‌, చెన్నకేశవులు ఉన్నారు 

Updated Date - 2022-01-26T05:09:44+05:30 IST