Central Minister Bharati Pravin Pawar: సీఎం జగన్ ఫొటోలు మాత్రమే ఉండటంపై సీరియస్

ABN , First Publish Date - 2022-09-11T23:15:33+05:30 IST

కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ గుడివాడలో పర్యటించారు. టిడ్కో ఫ్లాట్లనిర్మాణ పనులను..

Central Minister Bharati Pravin Pawar: సీఎం జగన్ ఫొటోలు మాత్రమే ఉండటంపై సీరియస్

కృష్ణా: కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ (Central Minister Bharati Pravin Pawar) గుడివాడలో పర్యటించారు. తొలుత టిడ్కో ప్లాట్ల (Tidco Plots)  నిర్మాణ పనులను ఆమె పరిశీలించారు.  అనంతరం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌ను తనిఖీ చేశారు. ఆస్పత్రి ప్రాంగణంలో కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకాల ముద్రలు లేకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని విభాగాల్లో వైఎస్సార్, ముఖ్యమంత్రి జగన్ ఫొటోలు మాత్రమే ఉండటమేంటని అధికారులను ప్రశ్నించారు.  ఈ సందర్భంగా భారతి ప్రవీణ్ పవార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేలా రాష్ట్రంలో ప్రచారం లేదని మండిపడ్డారు.  ఆయుష్మాన్ భారత్ (Ayushman Bharat), మిషన్ మోదీ (Mission Modi) లాంటి పథకాలపై అవగాహన కల్పించేలా బ్యానర్లు ఏర్పాటు చేస్తామని ఆమె చెప్పారు. రోగులకు సత్వర వైద్య సేవలు అందేలా హాస్పిటల్స్‌లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని భారతి ప్రవీణ్ పవర్ తెలిపారు. 

Updated Date - 2022-09-11T23:15:33+05:30 IST