కేంద్రమంత్రి వ్యాఖ్యలపై ఉద్యోగుల నిరసన

Published: Wed, 11 May 2022 08:56:11 ISTfb-iconwhatsapp-icontwitter-icon
కేంద్రమంత్రి వ్యాఖ్యలపై ఉద్యోగుల నిరసన

వేలూరు(చెన్నై): కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యలపై ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్న పాత పింఛన్‌ విధానం అమలు సాధ్యం కాదని ఇటీవల కేంద్రమంత్రి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో, కేంద్రమంత్రి వ్యాఖ్యలు ఖండిస్తూ, ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచాలి, బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయుల మూడు నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ఉపాధ్యాయ సంఘాలు మంగళవారం కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టాయి. ఈ ధర్నాకు జిల్లా అధ్యక్షుడు రాజేష్ ఖన్నా అధ్యక్షత వహించగా, జిల్లా సెక్రటరీ అజీ్‌సకుమార్‌, జిల్లా కోశాధికారి జయకుమార్‌, టెక్నికల్‌ విద్య ఉపాధ్యాయుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు జనార్దనన్‌, విద్యా నిర్వాహణ అధికారి శేఖర్‌ పాల్గొన్నారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.