ఏ హామీ నెరవేర్చారో కేసీఆర్ చెప్పాలి.. కిషన్ రెడ్డి డిమాండ్

ABN , First Publish Date - 2022-08-28T00:12:53+05:30 IST

కుటుంబ పాలన నుంచి తెలంగాణ (Telangana)కు విముక్తి కల్పిస్తామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి...అన్నారు. బండి సంజయ్ (Bandi Sanjay) మూడో విడత పాదయాత్ర ముగిసిన సందర్భంగా హనుమకొండ..

ఏ హామీ నెరవేర్చారో కేసీఆర్ చెప్పాలి.. కిషన్ రెడ్డి డిమాండ్

హనుమకొండ: కుటుంబ పాలన నుంచి తెలంగాణ (Telangana)కు విముక్తి కల్పిస్తామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) అన్నారు. బండి సంజయ్ (Bandi Sanjay) మూడో విడత పాదయాత్ర ముగిసిన సందర్భంగా హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో బీజేపీ (Bjp) బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ వరంగల్ (Warangal) అభివృద్ధికి సీఎం కేసీఆర్ (Cm Kcr) ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. జగిత్యాల- వరంగల్‌ రోడ్డు కోసం కేంద్రం రూ.4,321 కోట్లు ఖర్చు చేస్తోందని తెలిపారు.  ‘‘వరంగల్ - ఖమ్మం రోడ్డు కోసం రూ. 3,364 కోట్లు కేంద్రం ఖర్చు చేస్తోంది. రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం కోసం కేంద్రం రూ. 20 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది. రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు తెచ్చాం. రామప్ప ఆలయ అభివృద్ధి కోసం రూ.60 కోట్లు ఖర్చు చేస్తున్నాం. వెయ్యి స్తంభాల ఆలయ అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటున్నాం.’’ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 


‘‘కాళేశ్వరానికి కేంద్రం వేల కోట్ల నిధులు ఇచ్చింది. వరంగల్‌లో స్మార్ట్‌ సిటీ కోసం కేంద్రం రూ. 196 కోట్లు ఖర్చు చేశాం. వరంగల్‌ జిల్లాలో సైనిక స్కూల్ రాబోతుంది.  రూ.8,200 కోట్లతో రైతుల నుంచి పత్తికొనుగోలు చేస్తాం.  వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో గిరిజన వర్సిటీ ఏర్పాటు చేస్తాం. 1300 కి.మీ. రైల్వే లైన్‌ కోసం రాష్ట్ర సర్కార్ భూమి కేటాయించలేదు. టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించాలి.  కేసీఆర్ కుటుంబాన్ని ఫామ్‌హౌస్‌కే పరిమితం చేయాలి.’’ అని కిషన్ రెడ్డి అన్నారు. 




Updated Date - 2022-08-28T00:12:53+05:30 IST