
Telangana: ప్రజలపై భారం తగ్గించేందుకు కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించిందని, దేశంలోనే అత్యధికంగా సెస్సు వసూలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం కూడా పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ రైతులను వదిలేసి.. కేసీఆర్ పంజాబ్ రైతులను ఆదుకోవడం ఏమిటని ప్రశ్నించారు. కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యా విధానంపై కేసీఆర్‌కు కనీస అవగాహన కూడా లేదన్నారు. కేసీఆర్ ప్రకటించిన కేజీ టు పీజీ ఉచిత విద్యపై ఆయనే స్పందించాలన్నారు. కేసీఆర్ అమెరికా అధ్యక్షుడిని కలిసినా, పాకిస్థాన్ అధ్యక్షుడిని కలిసినా తాము భయపడమన్నారు. కేసీఆర్ సంచలనాలు ప్రగతి భవన్, ఫాంహౌస్‌కే పరిమితమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల నుంచి కేసీఆర్ కుటుంబానికి చీదరింపు తప్పదన్నారు.
ఇవి కూడా చదవండి