తెలంగాణలో రెండు జాతీయ రహదారులు జాతికి అంకితం

ABN , First Publish Date - 2022-04-29T17:59:58+05:30 IST

తెలంగాణలో రెండు జాతీయ రహదారులను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ జాతికి అంకితం చేశారు.

తెలంగాణలో రెండు జాతీయ రహదారులు జాతికి అంకితం

హైదరాబాద్‌: తెలంగాణలో రెండు జాతీయ రహదారులను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ జాతికి అంకితం చేశారు. శుక్రవారం రాష్ట్ర పర్యటనలో భాగంగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ రూ.7,853కోట్ల జాతీయ రహదారులకు శంకుస్థాపన,  ప్రారంభోత్సవం చేశారు. 10 జాతీయ రహదారులకు శంకుస్థాపన చేయగా... 2 జాతీయ రహదారులను జాతికి అంకితం చేశారు. దాదాపు 258 కిలో మీటర్ల జాతీయ రహదారుల విస్తరణకు గడ్కరీ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రి వేముల ప్రశాంతి రెడ్డి, ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, రాములు, బీబీ పాటిల్, రంజిత్  రెడ్డి, పసునూరి దయాకర్, మన్నె శ్రీనివాసరెడ్డి తదితరులు హాజరయ్యారు. అలాగే కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Updated Date - 2022-04-29T17:59:58+05:30 IST