ఉపాధిహామీ పనులను తనిఖీ చేసిన కేంద్ర బృందం

ABN , First Publish Date - 2022-05-16T05:03:01+05:30 IST

మద్దూరు మండలంలో ఉపాధిహామీ పథకంలో చేపట్టిన పనులను నేషనల్‌ లెవల్‌ మానిటర్‌ టీం సభ్యులు ఆదివారం సందర్శించి తనిఖీ చేశారు.

ఉపాధిహామీ పనులను తనిఖీ చేసిన కేంద్ర బృందం
లద్నూరులో ఉపాధిహామీలో చేపట్టిన నర్సరీ పనులను పర్యవేక్షిస్తున్న టీం సభ్యులు

మద్దూరు, మే 15: మద్దూరు మండలంలో ఉపాధిహామీ పథకంలో చేపట్టిన పనులను నేషనల్‌ లెవల్‌ మానిటర్‌ టీం సభ్యులు ఆదివారం సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మండలంలోని లద్నూరు, మర్మాముల, రేబర్తి, గాగిళ్లాపూర్‌లో గ్రామాల్లో ఉపాధిహామీ పథకంలో చేపట్టిన నర్సరీలు, మామిడి, ఆయిల్‌పామ్‌ తోటలు, పల్లె ప్రకృతివనాలు, పశువుల కొట్టాలతో పాటు సీసీరోడ్లను టీం సభ్యులు డాక్టర్‌ కేఎ్‌స.పుష్ప, డాక్టర్‌ ఎం.ముత్తుకుమార్‌ పరిశీలించారు. నేరుగా రైతుల ద్వారా చేపట్టిన పనులు ఏ మేరకు ఉపయోగపడుతున్నాయి, గతంలో ఎట్లా ఉండేది. ఇప్పుడు ఎట్లా ఉందంటూ అడిగి తెలుసుకున్నారు. లద్నూరులో ఓ రైతు నిర్మించుకున్న పశువుల షెడ్డును సందర్శించిన టీం సభ్యులు షెడ్డు నిర్మాణం తర్వాత ఏ విధంగా ఉందంటూ ఆడిగారు. గతంలో చెట్ల కింద పశువులను కట్టేసేది. ప్రస్తుతం షెడ్డు నిర్మాణంతో పశువులకు ఎంతో రక్షణగా ఉన్నదని, పశువులు ఆరోగ్యంగా ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గిరి కొండల్‌రెడ్డి, సొసైటీ వైస్‌ చైర్మన్‌ ఇర్రి రాజిరెడ్డి, ఏపీడీ ఓబులేష్‌, ఎంపీడీవో శ్రీనివాస్‌, పీఆర్‌ ఏఈ వినయ్‌, ఈసీ పరశురాములు, టీఏ వెంకటమ్మ, సర్పంచులు సుదర్శన్‌, ఎంపీటీసీ సమ్మయ్య, ఉపసర్పంచులు, సెక్రటరీలు, గ్రామస్థులు పాల్గొన్నారు. 

గ్రామాలభివృద్ధికి ప్రధాన భూమిక ఉపాధిహామీ

మద్దూరు, మే 15: గ్రామాలాభివృద్ధికి ఉపాధిహామీ పథకం ప్రధాన భూమికను పోషిస్తున్నదని జడ్పీటీసీ గిరి కొండల్‌రెడ్డి అన్నారు. ఆదివారం మద్దూరు మండలంలోని లద్నూరులో ఉపాధిహామీ పనుల పర్యవేక్షణకు వచ్చిన నేషనల్‌ లెవల్‌ మానిటరింగ్‌ టీం సభ్యులకు స్వాగతం పలికారు. అనంతరం గ్రామపంచాయతీలో ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఉపాధిహామీ పథకంలో చేపడుతున్న పనులు గ్రామాభివృద్ధితో పాటు వలసల నివారణకు ఎంతగానో తోడ్పాటునందించిందన్నారు. ఆయన వెంట సర్పంచులు, ఎంపీటీసీలు ఉన్నారు. 

Updated Date - 2022-05-16T05:03:01+05:30 IST