ధాన్యంలో తేమ లేకుండా చూసుకోవాలి

ABN , First Publish Date - 2020-12-03T05:24:23+05:30 IST

జిల్లావ్యాప్తంగా సుమారు 45వేల మెట్రిక్‌ టన్నుల రంగు మారిన ధాన్యం ఉండవచ్చని వ్యవసాయ శాఖ ఉప సంచాలకుడు మాధవరావు పేర్కొన్నారు. మండలంలోని పోతవరంలో రంగు మారిన ధాన్యాన్ని బుధవారం ఆయన కేంద్ర బృందంతో కలిసి పరిశీలించారు.

ధాన్యంలో తేమ లేకుండా చూసుకోవాలి
పి.గన్నవరం మండలం పోతవరంలో ధాన్యాన్ని పరిశీలిస్తున్న కేంద్ర బృందం సభ్యులు

  • వ్యవసాయ శాఖ ఉప సంచాలకుడు మాధవరావు

పి.గన్నవరం, డిసెంబరు 2: జిల్లావ్యాప్తంగా సుమారు 45వేల మెట్రిక్‌ టన్నుల రంగు మారిన ధాన్యం ఉండవచ్చని వ్యవసాయ శాఖ ఉప సంచాలకుడు మాధవరావు పేర్కొన్నారు. మండలంలోని పోతవరంలో రంగు మారిన ధాన్యాన్ని బుధవారం ఆయన కేంద్ర బృందంతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు ధాన్యంలో తేమ లేకుండా చూసుకోవాలని కోరారు. కేంద్ర బృందం ప్రభుత్వానికి ఇచ్చే నివేదిక ఆధారంగా రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని వివరించారు. జేసీ ఆదేశాలతో ప్రతి 20 ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఒక కమాండ్‌ కంట్రోల్‌ టీమ్‌ ఏర్పాటు చేస్తామన్నారు. రెండో పంటకు మార్చి 31కి కాలువలకు విరా మం ప్రకటించినందున 100-120 రోజుల్లో పంట చేతికి వచ్చే వంగడాలను రైతులు ఎంపిక చేసుకుని సకాలంలో నాట్లు పూర్తి చేసుకోవాలని సూచించారు. అనంతరం కేంద్రం బృందం సభ్యులు ధాన్యం నమూనాలను సేకరించారు. పరిశీలనలో కేంద్ర సాంకేతిక బృందం సభ్యులు ఎంజెడ్‌ ఖాన్‌, నవీన్‌, కిరణ్‌కుమార్‌, విశాఖ జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్‌ వెంకటరమణ, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకుడు ఎస్‌జేఈ మోహనరావు, ఏవో కె.ప్రవీణ్‌ ఉన్నారు.

Updated Date - 2020-12-03T05:24:23+05:30 IST