పెరిగిన ధరలను తగ్గించాలి

ABN , First Publish Date - 2022-07-07T05:56:50+05:30 IST

పెరిగిన నిత్యావసర సరుకులు, డీజిల్‌, పెట్రోల్‌, గ్యాస్‌ ధరలను తగ్గించాలని కోరుతూ సెంట్రల్‌ తెలుగు మహిళా కమిటీ ఆధ్వర్యంలో టీడీపీ కార్యాలయం వద్ద బుధవారం నిరసన జరిపారు.

పెరిగిన ధరలను తగ్గించాలి

పెరిగిన ధరలను తగ్గించాలి

సెంట్రల్‌ తెలుగు మహిళా కమిటీ ఆధ్వర్యంలో నిరసన

పాయకాపురం, జూలై 6 : పెరిగిన నిత్యావసర సరుకులు, డీజిల్‌, పెట్రోల్‌, గ్యాస్‌ ధరలను తగ్గించాలని కోరుతూ సెంట్రల్‌ తెలుగు మహిళా కమిటీ ఆధ్వర్యంలో టీడీపీ కార్యాలయం వద్ద బుధవారం నిరసన జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ. 350 ఉన్న గ్యాస్‌ బండ ధర నేడు రూ. 1150 పెరిగిందని చెప్పారు. తక్షణమే ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి పెంచిన ధరలను  తగ్గించాలని, లేని పక్షంలో మహిళలంతా కలసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. తెలుగు మహిళా కమిటీ సభ్యులు దాసరి ఉదయశ్రీ, లబ్బా దుర్గ, రమణమ్మ, లీలా, సరోజ, తులసమ్మ, లక్ష్మీ, దుర్గ, సత్య, సావిత్రి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-07T05:56:50+05:30 IST