జిల్లాలో కేంద్ర జలశక్తి అభియాన్‌ బృందం పర్యటన

ABN , First Publish Date - 2022-06-25T07:05:10+05:30 IST

మండలంలోని మెట్లచిట్టాపూర్‌, రాజేశ్వర్‌రావుపేట గ్రామాల్లో శుక్రవారం కేంద్ర జలశక్తి అభియాన్‌ బృందం సభ్యులు హాన్స్‌ రాజ్‌ మీన, మణివన్నన్‌లు పర్యటించారు.

జిల్లాలో కేంద్ర జలశక్తి అభియాన్‌ బృందం పర్యటన
మెట్లచిట్టాపూర్‌లో ఫారం పాండ్‌ను పరిశీలిస్తున్న కేంద్ర బృందం సభ్యులు

మెట్‌పల్లి రూరల్‌, జూన్‌ 24 : మండలంలోని మెట్లచిట్టాపూర్‌, రాజేశ్వర్‌రావుపేట గ్రామాల్లో శుక్రవారం కేంద్ర జలశక్తి అభియాన్‌ బృందం సభ్యులు హాన్స్‌ రాజ్‌ మీన, మణివన్నన్‌లు పర్యటించారు. మెట్లచిట్టాపూర్‌లోని మంకీ పుడ్‌ కోర్టు, ఫారం పాండ్‌, బృహత్‌ పల్లె ప్రకృతి వనం, పంచాయతీ కార్యాలయంను పరిశీలించి మండలంలోని గ్రామాలలో చేపట్టిన అభివృద్ధి పనులను అడిగి తెలుసుకుని ఎంపీపీ మారు సాయిరెడ్డి, ఎంపీడీవో భీమేశ్‌రెడ్డి, సర్పంచు బద్దం శేఖర్‌రెడ్డిలను అభినందించారు. అనంతరం రాజేశ్వర్‌రావుపేట గ్రామంలోని రివర్స్‌ పంపింగ్‌ను పరిశీలించి పంపు ద్వారా నీటి సరఫరా విధానాన్ని ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రజా ప్రతినిధులతో మాట్లాడి నిర్వహిస్తున్న అభివృద్ధి పనుల గురించి తెలుసుకున్నారు. సర్పంచులు కట్ట శ్రీధర్‌, ఆకుల రాజారెడ్డి, ఎంపీటీసీ నోముల గంగాధర్‌, డీఆర్డీవో వినోద్‌, అడిషనల్‌ డీఆర్డీవో నరేశ్‌, ఏపీడీ శివా జీ, ఎంపీవో మహేశ్వర్‌రెడ్డి, ఎపీవో తిరుపతిరావు, సిబ్బంది పాల్గొన్నారు.

కోరుట్ల రూరల్‌ : మండలంలోని అయిలాపూర్‌ గ్రామంలో కేంద్ర బృం దం శుక్రవారం పర్యటించింది. గ్రామంలో జలశక్త అభియాన్‌ పథకంలో నిర్వహిస్తున్న పనులను కేంద్ర బృందం సభ్యులు శ్రీహన్స్‌ రాజ్‌ మీనా, డా. మన్వినస్‌లు పరిశీలన జరిపారు. గ్రామానికి విచ్చేసి కేంద్ర బృందానికి గ్రామ సర్పంచ్‌ పిడుగు రాధ - సందయ్య, ఆర్‌డీవో వినోద్‌కుమార్‌, ఇన్‌ చార్జి ఎంపీడీ నీరజ స్వాగతం పలికారు. గ్రామంలో నిర్వహిస్తున్న బృహ త్‌ పల్లె పకృతి వనం, మంకీఫుడ్‌ కోర్ట్‌ పనులను పరిశీలించి జరుగుతున్న పనుల వివరాలను నమోదు చేసుకున్నారు. గ్రామంలో జరుగుతున్న ఉ పాధి పనలు వివరాలను అడిగి తెలుసుకుని వాటిని పరిశీలించారు.  కేం ద్ర బృందం మొదట బృహత్‌ పల్లె ప్రకృతి వనంలో మొక్కలు నాటి పరిర క్షణకు ట్రాగార్డును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ జిల్లా అధికారి బాలె శివాజీ, ఏపీడీ నరేష్‌, పలువురు పాల్గొన్నారు. 

కథలాపూర్‌ : మండలంలోని అంబారిపేట, పోసానిపేట, తాండ్ర్యాల గ్రామాల్లో శుక్రవారం కేంద్ర జలశక్తి అభియాన్‌ బృందం పర్యటించింది. అంబారిపేటలో ఇటీవల నిర్మించిన నీటి కుంటతో పాటు తాండ్ర్యాలలో ప ల్లె ప్రకృతి వనం, భవనాలపై నుంచి వృధాగా పోతున్న వాన నీటి ఇంకు డు గుంతల పనులను పరిశీలించి సంతృప్తి చెందారు. ఈ సందర్భంగా మీనా, మణివన్నన్‌, ఏపీడీ శివాజీ, ఎంపీడీవో నవీన్‌కుమార్‌, ఎంపీవో ప్ర వీణ్‌కుమార్‌, సర్పంచులు గడీల గంగప్రసాద్‌, ఎంజీరెడ్డి, గోపు శ్రీనివాస్‌ తదిగరులు ఉన్నారు.

మేడిపల్లి: మండలంలోని విలాయతాబాద్‌ గ్రామాన్ని కేంద్ర బృందం సభ్యులు సందర్శించారు. ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాంలో వంద శాతం ఇంకుడు గుంతల నిర్మాణం చేశారు. ఇంటికి ఆరు మొక్కల చొప్పు న హరితహారం మొక్కలను నాటిన వాటిని బృందం సభ్యులు పరిశీలించారు. మండలంలో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులను పరిశీలించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర బృందంలో డిప్యూటీ సెక్రెట్రీ లెజిస్టేటివ్‌ డిపార్టుమెంట్‌ హెచ్‌ఆర్‌, మీన,  మణివన్నన్‌, సైటిస్టు, ఆర్‌డీవో వినోద్‌ కుమార్‌, పీడీ వినోద్‌ కుమార్‌, ఎంపీవో సుష్మ, సర్పంచ్‌ పోచమ్మ, రమేష్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-25T07:05:10+05:30 IST