ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి Droupadi Murmuకు జడ్ ప్లస్ సెక్యూరిటీ

ABN , First Publish Date - 2022-06-22T17:14:07+05:30 IST

ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిని ద్రౌపది ముర్మూకు కేంద్రప్రభుత్వం బుధవారం నాడు జడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించింది....

ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి Droupadi Murmuకు జడ్ ప్లస్ సెక్యూరిటీ

న్యూఢిల్లీ: ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిని ద్రౌపది ముర్మూకు కేంద్రప్రభుత్వం బుధవారం నాడు జడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించింది. మంగళవారం సాయంత్రం ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థినిగా ద్రౌపది ముర్మూను ప్రకటించిన నేపథ్యంలో ఆమెకు సెక్యూరిటీ కల్పించారు. జడ్ ప్లస్ సెక్యూరిటీ  కవర్ ప్రకారం సీఆర్‌పీఎఫ్ కమాండోలతో రక్షణ ఏర్పాటు చేశారు. దేశంలోనే జడ్ ప్లస్ సెక్యూరిటీ భద్రత అంటే అత్యంత కీలకమైనది. ఒడిశా రాష్ట్రానికి చెందిన సంతాల్ గిరిజన కులంలో పుట్టిన ద్రౌపది 1997వ సంవత్సరంలో రైరంగపూర్ నగర పంచాయతీలో కౌన్సిలరుగా రాజకీయ జీవితం ప్రారంభించారు. 


అనంతరం 2000 వ సంవత్సరంలో ఒడిశా రాష్ట్ర మంత్రిగా పనిచేసిన ముర్మూ 2015వ సంవత్సరంలో జార్ఖండ్ రాష్ట్ర గవర్నరుగా పనిచేశారు.రాయ్‌రంగ్‌పూర్ అసెంబ్లీ స్థానం నుంచి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ద్రౌపది ముర్ము పనిచేశారు. జార్ఖండ్ తొలి మహిళా గవర్నర్‌గా కూడా ద్రౌపది ముర్ము గుర్తింపు పొందారు.


Updated Date - 2022-06-22T17:14:07+05:30 IST