‘ఆరోగ్యసేతు’ వివాదంలో అధికారులపై చర్యలు!

ABN , First Publish Date - 2020-10-30T08:18:12+05:30 IST

ఆరోగ్యసేతు యాప్‌ గురించి ఆర్టీఐ ద్వారా ఓ సామాజిక కార్యకర్త అడిగిన వివరాలను అందించడంలో విఫలమైన అధికారులపై చర్యలు తీసుకునేందుకు కేంద్రం సిద్ధమవుతోంది...

‘ఆరోగ్యసేతు’ వివాదంలో అధికారులపై చర్యలు!

  • కేంద్ర ఐటీ, ఎలకా్ట్రనిక్స్‌ మంత్రిత్వశాఖ ఆదేశాలు


న్యూఢిల్లీ, అక్టోబరు 29: ఆరోగ్యసేతు యాప్‌ గురించి ఆర్టీఐ ద్వారా ఓ సామాజిక కార్యకర్త అడిగిన వివరాలను అందించడంలో విఫలమైన అధికారులపై చర్యలు తీసుకునేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. కేంద్ర ఐటీ, ఎలకా్ట్రనిక్స్‌ మంత్రిత్వశాఖ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అలాగే, కేంద్ర సమాచార కమిషన్‌ సూచనల మేరకు దరఖాస్తుదారు అడిగిన వివరాలన్నీ వెంటనే అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. కాగా, ఆరోగ్యసేతు యాప్‌ ద్వారా సేకరించిన ప్రజల వ్యక్తిగత సమాచారం మొత్తాన్ని తొలగించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ తెహసీన్‌ పూనవల్లా అనే ఓ సామాజిక కార్యకర్త సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బోబ్డేకి లేఖ రాశారు. ఈ లేఖను సుమోటోగా తీసుకుని.. కేంద్రానికి ఆదేశాలు జారీ చేయాలని విన్నవించారు.

Updated Date - 2020-10-30T08:18:12+05:30 IST