నేరారోపణ రుజువైన నేతలపై జీవితకాల నిషేధాన్ని తప్పుబట్టిన కేంద్రం

ABN , First Publish Date - 2020-12-04T03:00:59+05:30 IST

నేరారోపణ రుజువైన రాజకీయ నేతలపై జీవితకాలం నిషేధం విధించాలని సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌ను కేంద్ర ప్రభుత్వం తప్పుపట్టింది. న్యాయవాది అశ్వనీకుమార్‌...

నేరారోపణ రుజువైన నేతలపై జీవితకాల నిషేధాన్ని తప్పుబట్టిన కేంద్రం

న్యూఢిల్లీ: నేరారోపణ రుజువైన రాజకీయ నేతలపై జీవితకాలం నిషేధం విధించాలని సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌ను కేంద్ర ప్రభుత్వం తప్పుపట్టింది. న్యాయవాది అశ్వనీకుమార్‌ ఉపాధ్యాయ్‌ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను కొట్టివేయాలని సుప్రీంకోర్టును కేంద్రం కోరింది. ఈ మేరకు కేంద్రం సుప్రీంకోర్టుకు అఫిడవిట్‌ సమర్పించింది. నేతలపై కేసుల సత్వర విచారణ పిటిషన్ విచారణ దశలో ఉన్నందున ఈ విషయంలో మరో పిటిషన్‌ అవసరం లేదని కేంద్రం ఆ అఫిడవిట్‌లో పేర్కొంది. ఐపీసీ సెక్షన్ల ప్రకారం, ప్రజాప్రతినిధులపై శిక్షలు విధించే విషయంలో ఎలాంటి వివక్ష లేదని న్యాయస్థానానికి కేంద్రం వెల్లడించింది.

Updated Date - 2020-12-04T03:00:59+05:30 IST